Gold Prices Today : బంగారం కొనుగోలు చేసే వారికి గుడ్ టైమ్.. ధరలు తగ్గాయోచ్

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గాయి.

Update: 2024-06-26 03:06 GMT

బంగారం అంటేనే అదొక క్రేజ్. స్టేటస్ సింబల్ గా మారిపోయింది. గోల్డ్ ఎంత ఎక్కువ ఉంటే అంతగా సమాజంలో గౌరవం లభిస్తుందని విశ్వసించేవాళ్లు ఎక్కువయ్యారు. ధనిక వర్గాలు బంగారు ఆభరణాలు ధరించకపోయినా కొనుగోలు చేసి పెట్టుబడిగా చూస్తుంటారు. మధ్యతరగతి వర్గాలు మాత్రం కేవలం ఆభరణాలను ధరించడానికే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఉద్యోగ, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఇష్టపడే బంగారం, వెండి ధరలు ఇటీవల కాలంలో పెరుగుతూ వస్తున్నాయి. ధరలు అందుబాటులో లేకపోయినా సరే బంగారాన్ని సొంతం చేసుకోవాలని భావించి దానిని కొనుగోలు చేస్తున్నారు.

స్కీమ్ ల ద్వారా...
ఇక జ్యుయలరీ దుకాణాలు కూడా అన్ సీజన్ లో ఆఫర్లు భారీగానే ప్రకటిస్తున్నాయి. తరుగు మీద తగ్గింపు అంటూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక స్కీముల ద్వారా కూడా బంగారాన్ని సొంతం చేసుకునేలా జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం వినియోగదారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో ముందుగా ఈఎంఐ ద్వారా కొంత మొత్తాన్ని చెల్లిస్తూ బంగారాన్ని కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. స్కీమ్ లో చేరిన వారికి కొంత రాయితీలను కూడా కల్పిస్తుండటంతో పేద, మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు బంగారం, వెండిని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు.
ధరలు నేడు...
ఆగస్టు నెల నుంచి తిరిగి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. మూఢమి తొలగిపోనుండటంతో బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,240 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 72,220 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 95,400 రూపాయలుగా కొనసాగుతుంది.


Tags:    

Similar News