Gold Prices Today : ప్రియమైన పసిడి దిగివస్తుంది.. కొద్ది రోజులు నుంచి తగ్గుదల కనిపిస్తుందిగా

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి

Update: 2024-06-18 02:43 GMT

బంగారానికి ఎడిక్ట్ అయిన వారు ధర ఎంతైనా కొనుగోలు చేస్తారు. బంగారం కొనుగోలు ఒక వ్యసనం అని చెబుతారు. తమ వద్ద ఉన్న డబ్బులతో బంగారాన్ని కొనుగోలు చేయడం మంచి పనే అయినా తమ ఆర్థిక శక్తికి మించి కూడా కొందరు కొనుగోలు చేస్తుంటారు. అవసరమైన, క్లిష్టమైన సమయంలో పసిడి తమను ఆదుకుంటుందన్న భావనతో దానిని ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. అండగా ఉండటమే కాకుండా మనసులో ఉన్న భయాన్ని పోగొట్టేది బంగారం మాత్రమేనని ఎక్కువ మంది నమ్ముతారు. అందుకే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు.

డిమాండ్ తగ్గని...
అదే సమయంలో వెండి కూడా అంతే. బంగారం, వెండి రెండు వస్తువులను తమ ఇంట్లో ఉంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ఈ రెండు వస్తువుల ధరలు ఏ రోజుకారోజు భారంగా మారుతున్నాయి. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందకుండా పోతున్నాయి. ఎక్కువ మంది పెట్టుబడిగా చూసే బంగారం, వెండి వస్తువులకు ఒక సీజన్ అంటూ లేకుండా పోయింది. అందుకే నిత్యం వినియోగదారులతో జ్యుయలరీ దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. అందుకే బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయాలంటే ఇప్పుడు సామాన్యులకే కాదు మధ్యతరగతి ప్రజలకు కూడా కష్టంగా మారందనే చెప్పాలి.
తగ్గిన ధరలు...
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజుల నుంచి దిగివస్తుండటం వినియోగదారులకు కొంత ఊరట నిచ్చే అంశంగానే చెప్పాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,290 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,320 రూపాయల వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర 95,500 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.



Tags:    

Similar News