Gold Prices Today : ఇప్పుడే బంగారం కొనుగోలు చేయడం మంచిదట.. అందుకు రీజన్ ఇదే

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి

Update: 2024-07-21 03:50 GMT

బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. మహిళలు అత్యంత ఇష్టపడి కొనుగోలు చేసే బంగారం, వెండి ధరలు దిగి వస్తాయనుకోవడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలోనే పసిడికి ఉన్న డిమాండ్ మరే వస్తువుకు లేదు. భూమి తర్వాత అత్యంత వేగంగా పెరిగేది ఏదైనా ఉందీ అంటే అది బంగారం అని మాత్రమే చెప్పకతప్పదు. బంగారం, వెండి దిగుమతులు తగ్గడంతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న పలు రకాలైన కారణాలతో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే సీజన్ అనేది సంబంధం లేకుండా ధరలు పెరుగుతున్నాయని వినియోగదారులు సయితం పసిడి విషయంలో కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆభరణాలను ఎక్కువగా....
దక్షిణ భారతదేశంలో బంగారం, వెండి ఆభరణాలు కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. మహిళలు మక్కువగా చూపే ఆభరణాలను తయారు చేయడానికి జ్యుయలరీ దుకాణాలు పోటీ పడుతుంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా దక్షిణ భారత దేశంలోనూ జ్యుయలరీ దుకాణాలున్నాయి. ప్రతి సందుకు ఒక కార్పొరేట్ దుకాణం వెలిసిందంటే బంగారాన్ని ఏ మేరకు కొనుగోలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో పెళ్లిళ్లకు, శుభకార్యాలకు మాత్రమే బంగారం, వెండి కొనుగోలు చేేసేవారు. కానీ ఇప్పుడు చిన్న స్థాయి ఫంక్షన్ కు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకోవడంతో ఎప్పుడూ జ్యుయలరీ దుకాణాలు కిటికిటలాడుతుంటాయి.
నేడు స్థిరంగా...
బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. ఇక రానున్నది శ్రావణ మాసం కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆషాఢమాసంలోనూ బంగారం ధరలు పెరిగితే ఇక శ్రావణమాసంలో మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు. దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. ఇది ఒకరకంగా సంతోషకరమైన వార్తేనని చెప్పాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,800 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,970 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 96,000 రూపాయలకు చేరుకుందని మార్కెట్ వర్గాలు చెప్పాయి.


Tags:    

Similar News