Gold Prices : బంగారం ధర పెరగలేదు.. వెండి ధరలు కూడా అంతే

బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి.

Update: 2024-01-11 03:38 GMT

gold prices remain stable today

బంగారం ధరలు పెరగడం అనేది సాధారణ విష‍యంగానే మారిపోయింది. తగ్గితేనే కొనుగోలుదారులు కూడా స్పందిస్తున్నారు. లేకుంటే పెరిగేదే కదా? అందులో ఆశ్చర్యం ఎందుకు? అన్న ప్రశ్నలు వినియోగదారుల నుంచి ఎదురవుతుంటాయి. బంగారం ధరలు అంతగా పెరిగి పోవడానికి అనేక కారణాలున్నాయి. అందులో అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులతో పాటు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ధరల విషయంలో...
పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న సమయంలో బంగారం ధరలు పెరుగుతుండటం అందరినీ ఆందోళన కల్గిస్తుంది. అదే తగ్గితే ఎక్కువ కొంటారు అని కాదు కానీ తాము ఎక్కువ బంగారాన్ని సొంతం చేసుకునే అవకాశముంటుందని భావించి మెంటల్ గా ప్రిపేర్ అయి జ్యుయలరీ దుకాణాలకు క్యూ కడుతుంటారు. అయితే ధరలు తగ్గినా... పెరిగినా.. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారాన్ని కొనుగోలు చేయాల్సి రావడంతో వ్యాపారాలు మాత్రం తగ్గడం లేదు. వారి బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగానే వర్థిల్లుతుంది.
నేడు ఇలా...
గత కొద్ది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. ఇది కొనుగోలుదారులు ఊరట కల్గించే అంశమే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నేడు బంగారం, వెండి ధరలు ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,700 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,950 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర మాత్రం . 77,500 రూపాయలుగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.


Tags:    

Similar News