Gold Prices : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి.
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సూపర్ సండే. ఎందుకంటే ధరలు పెరగలేదు. అందుకే పసిడిని కొనుగోలు చేయడానికి ఈరోజు సరైన రోజు అని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు. పసిడి ధరలు ఎప్పుడూ పైకే చూస్తుంటాయి. కిందకు చూస్తుండటం అరుదు. తక్కువగా ధరలు తగ్గుతుంటాయి. తగ్గినా స్వల్పంగానే ఉంటుంది. భారతీయ సంస్కృతిలో బంగారం ఒక భాగమయింది. పెళ్లిళ్ల సీజన్ కూడా కలిసి రావడంతో పసిడి కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతుంది.
వెండి కూడా...
బంగారంతో పాటు వెండి కూడా సామాన్య ప్రజలకు భారంగా మారింది. బంగారం, వెండి రెండు వస్తువులు భారతీయ సంస్కృతిలో శుభమైన వాటిగా పరిగణిస్తారు. ఎక్కువగా ఆభరణాలు, వస్తువులనే కొనుగోలు చేస్తారు. బంగారం ఉంటే కుటుంబానికి భరోసా అన్న నమ్మకం దక్షిణ భారతీయుల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకనే సౌత్ ఇండియాలో జరిగిన పసిడి కొనుగోళ్లు దేశంలో మరే ప్రాంతంలోనూ జరగవు. ఇక్కడ జ్యుయలరీ దుకాణాలు కూడా అధికంగానే ఉంటాయి.
ఈరోజు ధరలు...
అయితే ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఉదయం మార్కెట్ ధరలు ఇవి. సాయంత్రానికి మారే అవకాశాలున్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 57,700 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,950 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర ప్రస్తుతం 76,000 రూపాయలుగా ఉంది.