Gold Prices Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈసారి ఎంత పెరిగిందంటే?
ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
బంగారం ధరలకు కళ్లెం పడటం లేదు. ధరలు పెరుగుతూనే పోతున్నాయి. పేదలకు ఇక బంగారం భారంగా మారే అవకాశాలున్నాయి. ఇలా పెరుగుతూ పోతే ఇక బంగారాన్ని కొనుగోలు చేసేందుకు సామాన్యుడు సాహసం చేయరన్నది మార్కెట్ విశ్లేషకులు కూడా అంటున్న మాట. అంత మొత్తాన్ని వెచ్చించి బంగారాన్ని కొనుగోలు చేయడం వృధా అన్న అభిప్రాయం అందరిలోనూ కలిగే అవకాశముంది. పెళ్లిళ్ల సీజన్ ముగుస్తున్న సమయంలో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి అందరి ఆశలను తలకిందులను చేస్తున్నాయి.
భద్రతగా భావించి...
బంగారం అంటే మక్కువ ఉండని వారు ఎవరూ ఉండరు. మహిళలపై ఆ నెపం నెడతాము కానీ పురుషులు కూడా పసిడి పట్ల ఇటీవల కాలంలో ఆసక్తిని పెంచుకుంటున్నారు. ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేసి తమ వద్ద ఉంచుకుంటే భద్రతగా భావిస్తున్నారు. అదే సమయంలో బంగారం నిల్వలు పెరగడం లేదు. కానీ కొనుగోళ్లు మాత్రం భారీగా పెరిగాయి. అందుకే బంగారం ధరలు చుక్కలు నంటుతున్నాయన్నది విశ్లేషకుల అంచనాగా వినిపిస్తుంది. కేవలం బంగారం మాత్రమే కాదు వెండి ధరలు కూడా అమాంతం పెరిగి అందకుండా పోతుంది.
ధరలు నేడు...
ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. మరో వారం రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ముగుస్తుంది. మూడు నెలలు బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపరు. ఈ తరుణంలో నేడు బంగారం ధరలు దేశంలో భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 68,160 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,350 రూపాయలకు చేరుకుంది కిలో వెండి ధర 89,900 వద్ద ట్రెండ్ అవుతుంది.