Gold Prices Today : ఆషాఢమాసం చివరిలో పసిడి ధరలు షాకిస్తున్నాయిగా?

దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం కొద్దిగా తగ్గాయి

Update: 2024-07-17 03:30 GMT

పసిడి ధరలు పైపైకి ఎగబాకుతూనే ఉంటాయి. వాటిని ఆపడం ఎవరి తరమూ కాదు. గత కొన్నాళ్లుగా కొద్దిగా అటు ఇటుగా పసిడి ధరలు మళ్లీ పరుగును ప్రారంభించాయి. ఆషాఢం చివరలో అందరికీ షాక్ ఇస్తున్నట్లు బంగారం ధరలు పెరుగుతుండటం కొనుగోలుదారుల్లో ఆందోళనను కలిగిస్తుంది. శ్రావణమాసానికి ఇంకా పదిహేను రోజులు గడువు మాత్రమే ఉంది. ఈ సమయంలో ధరలు పెరుగుతూ పోతే ఇక సీజన్ లో ధరలు ఏ స్థాయికి చేరుకుంటాయన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. ఎందుకంటే శ్రావణమాసం అంటేనే బంగారంతో ముడిపెట్టి చూడాల్సిన విషయం కావడంతో ఖచ్చితంగా కొనుగోళ్లను బట్టి ధరలు పెరుగుతాయి.

మరో పదిహేను రోజుల్లో...
శ్రావణమాసంలో పెళ్లిళ్లతో పాటు అనేక శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాలకు బంగారం, వెండి కొనుగోలు మాత్రం తప్పనిసరి అయిపోయింది. సంప్రదాయంగా మారింది. అందుకే ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈలోపు బంగారం, వెండిని కొనుగోలు చేద్దామని భావించిన వారికి ఇప్పుడే ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ధరలు పెరుగుతుండటంతో పాటు ఆభరణాలు కొత్త డిజైన్ల కోసం వెయిట్ చేయాల్సిన సమయం లేకుండా ముందుగానే కొనుగోలు చేయాల్సి వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు. శ్రావణ మాసంలో కొత్త కొత్త డిజైన్లు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్న వారికి ధరలు పెరుగుదల చూసి బెంబేలెత్తిపోతున్నారు.
నేటి ధరలు ఇవీ...
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం కొద్దిగా తగ్గాయి. బంగారం ధరలు పెరగడం ప్రారంభించాయంటే ఇక ఆగవన్నది మార్కెట్ నిపుణులు సూచిస్తున్న మాట. ఇప్పుడు ఆషాఢ మాసమయినా స్వల్పంగా పెరిగిన కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు మార్కెట్ నిపుణుల నుంచి వెలువడుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,850 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,020 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర స్వల్పంగా తగ్గి ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 99,400 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News