Gold Prices Today : పసిడి ఇక గుప్పిట చిక్కటమంటే.. పైసలు ఎంత ఖర్చు చేయాలో తెలుసా?
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి
బంగారం ధరలు ఇప్పుడు పైపైకి చూస్తున్నాయి. బంగారం ధరలు వరసగా పెరుగుతున్నాయి. దీంతో బంగారం ధరలు మరింత ప్రియం కానున్నాయన్న హెచ్చరికలు నిజమయ్యేటట్లే కనిపిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ఎప్పుడూ అంతే. పెరగడమే కాని.. తగ్గడం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంటుంది. తగ్గినా స్వల్పంగానే ధర తగ్గి ఉస్పూరుమనిపిస్తుంది. డిమాండ్ కు తగినట్లుగా బంగారం, వెండి లేకపోవడం వల్లనే ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇదీ ఒక కారణమేనట...
మరోవైపు విదేశాల్లో నెలకొన్న మాంద్యం, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు ఎప్పటికప్పడు విశ్లేషిస్తుంటారు. అంతేకాదు... పెళ్లిళ్ల సీజన్ ముగియనుండటంతో బంగారం ధరలు మరింత పెరగనున్నాయి. వచ్చే నెల 28వ తేదీ వరకూ మాత్రమే ముహూర్తాలున్నాయి. తర్వాత మూడు నుంచి నాలుగు నెలలు మంచి ముహూర్తాలు లేకపోవడమూ బంగారం ధరలు పెరగడానికి కారణమని అంటున్నారు.
నేటి ధరలు...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,170 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,320 రూపాయలకు చేరుకుంది. వెండి ధర 80,600 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.