Gold Price Today : అలా బ్రేక్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ స్పీడ్ అందుకుందిగా
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలలో కూడా పెరుగుదల కనిపించింది
బంగారం ధరలు తగ్గుతున్నాయంటే అనుమానించాల్సిందే. ఎందుకంటే రెండుసార్లు స్వల్పంగా తగ్గాయంటే ఒకసారి భారీగా పెరిగినట్లే లెక్కేసుకోవాలని మార్కెట్ నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. అందుకే బంగారం, వెండి ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని సూచిస్తుంటారు. మూఢమి వచ్చిందని, కొనుగోళ్లు తగ్గుతాయని, ధరలు కూడా దిగి వస్తాయని భావిస్తే పొరపడినట్లేనని ఎప్పటి నుంచో నిపుణులు చెబుతున్నప్పటికీ కొనుగోలుదారులు మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఎంతో కొంత తగ్గుతుందన్న ఆశతో మరికొన్ని రోజులు కొనుగోలకు ఎదురుచూడాలనుకుంటారు.
ఎదురు చూపులు...
కానీ బంగారం విషయంలో ఎదురుచూపులు అనవసరం. ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనుగోలు చేయడం మంచిది. సీజన్ అంటూ లేకుండా పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయడం ఎవరికీ సాధ్యం కాదు. కొనుగోలు చేసే వాళ్లు ఎక్కువయ్యారు.. బంగారం మాత్రం అంతే ఉంది. డిమాండ్ కు తగినట్లు సప్లయ్ లేని కారణంగా రెండు వస్తువుల ధరలు పెరుగుతూనే ఉంటాయి. అందుకే బంగారం ధరలు దిగివస్తాయని ఊహించుకుని కొనుగోలు చేయకుండా ఉండటం అవివేకమని చెబుతున్నారు. రానున్న కాలంలో అక్షర తృతీయ ఉండటంతో ధరలు మరిత పెరిగే అవకాశముంది.
ధరలు ఇలా...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలలో కూడా పెరుగుదల కనిపించింది. అయితే స్వల్పంగా ధరలు పెరగడంతో ఒకింత ఊరట అయినా రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,260 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,280 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 83,600 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.