Gold Prices Today : ఇక ఆపడం ఎవరి తరమూ కాదట.. లక్షకు చేరుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు భారీగా పెరిగాయి
బంగారం ధరలకు రెక్కలు వచ్చినట్లే ఉంది. అసలు తగ్గడం లేదు. నిజమే బంగారం ఎప్పుడూ తగ్గదు. పెరగడం మాత్రం రోజూ పెరుగుతుంది. అదే గోల్డ్ విషయంలో జరుగుతుంది. బంగారం, వెండికి భారత దేశంలో ఉన్న డిమాండ్ అలాంటిది. పేద నుంచి ధనవంతుల వరకూ బంగారాన్ని కొనుగోలు చేయడం సంప్రదాయంగా మార్చుకున్నారు. నిత్యావసరం కాకపోయినా ఈ స్థాయిలో డిమాండ్ ఉన్న వస్తువు మరేదీ లేకపోవడంతో బంగారం ధరలు అందకుండా పోతున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండటమే ధరలు పెరగడానికి కారణం.
అంతా బంగారమే...
పిల్లాడు పుడితే బంగారం... పుట్టిన రోజు బంగారం... పెళ్లిళ్లకు బంగారం.. పెళ్లి రోజుకు బంగారం...ఇలా ఇళ్లలో జరిగే ప్రతి శుభ కార్యానికి బంగారం అవసరంగా మారింది. పోనీ డిమాండ్ కు తగినట్లు సప్లయ్ పెరిగిందంటే అది లేదు. అదే సప్లయ్.. డిమాండ్ మాత్రం రోజురోజుకూ అధికమవుతుంది. దీంతో ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. బంగారాన్ని పెట్టుబడిగా కూడా చూస్తుండటంతో ఇక ధరలు మాత్రం ఆగవని, త్వరలోనే లక్షకు చేరుకున్నా ఆశ్చర్యం పోవాల్సిన పనిలేదంటున్నారు మార్కెట్ నిపుణులు.
నేటి ధరలు...
ీఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వందరూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,210 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,320 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర మాత్రం 90,100 రూపాయలకు చేరుకుంది.