Gold Rates Today : బంగారం ఇంత భారంగా మారితే కొనుగోలు చేయగలమా?
బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పరుగును అందుకున్నాయి
బంగారం ధరలు తగ్గాయంటే పెరగడానికి సూచిక మాత్రమేనని అందరికి తెలిసిందే. అయినా ఇంకా ధరలు తగ్గుతాయన్న ధోరణిలో అనేక మంది కొనుగోలుదారులు వేచి చూస్తుంటారు. వెయిట్ చేసి కొనుగోలు చేయడం మంచిదని భావిస్తారు. కానీ బంగారం, వెండి విషయాల్లో వేచి చూడటం అనవసరమని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. ఎందుకంటే ధరలు పెరగడమే కాని తగ్గడం అనేది జరగదని, తగ్గినా స్వల్పంగానే ఉంటుందని, వెంటనే ధరలు పెరుగుతాయని వారు చెబుతున్నా తగ్గుతాయన్న ఆశతో అనేక మంది వేచి చూస్తుండటం అలవాటుగా మార్చుకున్నారు.
ధరలు పెరుగుతూనే...
బంగారం, వెండి ధరలు ఎందుకు పెరుగుతాయో అందరికీ తెలిసిందే. కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కొనుగోలుదారులు ఎక్కువ కావడం... దిగుమతులు తక్కువగా ఉండటంతో వాటి ధరలు అమాంతం పెరుగుతూనే ఉంటాయి. బంగారం, వెండి అనేది ఇక పేద, మధ్య తరగతి కుటుంబాల్లో కనపడని వస్తువుగా మారబోతుందా? అన్న అనుమానాలు బలపడేంత స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. అతి కొద్ది రోజుల్లోనే పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రూపాయలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు మార్కెట్ నిపుణులు.
నేటి ధరలు...
బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పరుగును అందుకున్నాయి. ధరలు తగ్గవనడానికి ఈ పెరుగుదల చూసిన వారికి ఎవరికైనా అర్థం కావాల్సిందే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,110 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,210 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,02,300 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.