Gold Prices : పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్... ధరలు ఎంతతగ్గాయంటే?

గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి

Update: 2023-11-24 02:34 GMT

బంగారం ధరలు ఎప్పటికప్పడు మార్పులు చోటు చేసుకుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులుంటాయి. ఇది అందరికీ తెలిసిందే. ఏ రోజు ధరలు పెరుగుతాయో చెప్పలేం. ఉదయం తగ్గిన బంగారం ధరలు సాయంత్రానికి మళ్లీ పెరిగే అవకాశాలున్నాయి. అందుకే బంగారానికి అంత డిమాండ్. ధరలు పెరిగినా డిమాండ్ తగ్గని వస్తువుగా పసిడికి పేరుంది.

అన్ సీజన్ లోనూ...
ఇక పెళ్లిళ్ల సీజన్ లో బంగారం గురించి చెప్పాల్సిన పనిలేదు. హద్దులు లేకుండా ధరలు పెరిగిపోతుంటాయి. జ్యుయలరీ దుకాణాలు ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటాయి. బంగారాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా పెట్టుబడిగా చూడటంతో పాటు స్టేటస్ సింబల్ గా పసిడి మారిపోవడంతో బంగారాన్ని కొనుగోలు చేసే వారు అధికమయ్యారు. అందుకే బంగారం ధరలకు బ్రేక్ లు పడేది చాలా తక్కువ. అన్ సీజన్ లోనూ బంగారాన్ని కొనుగోలు చేయడం అలవాటుగా మారింది.
వెండి ధరలు మాత్రం...
అయితే గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై యాభై రూపాయలు తగ్గింది. వెండి ధరలు మాత్రం పెరిగాయి. వెండి కిలో ధరపై రెండు వందల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,800 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,970 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర మాత్రం 79,200 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News