Gold Prices Today : అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత బంగారం ధరలు మరింత పెరుగుతాయా?
బంగారం ధరలు మరింత ప్రియంగా మారనున్నాయి. వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి.
బంగారం ధరలు మరింత ప్రియంగా మారనున్నాయి. వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఊహించని విధంగా పైకి ఎగబాకుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు పసిడిని కొనాలంటే జంకుతున్నారు. ప్రతి రోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. అనేక కారణాలతో ధరలు పెరుగుతుండటం, తగ్గుతుండటం మామూలే. విదేశాల్లో నెలకొన్న మాంద్యంతో పాటు అంతర్జాతీయ ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం వంటి కారణాలు బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.
మరింత పెరిగే...
ఈ ఈ ఏడాది బంగారం ధరల మరింత పెరిగే అవకాశముందన్న హెచ్చరికలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత పసిడి మరింత ప్రియం కానున్నదని కూడా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ కనుక అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయితే బంగారం ధర మరింత పైకి ఎగబాకుతుందని కూడా అంచనా వేస్తున్నారు. అందుకే ముందుగా కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు మార్కెట్ నిపుణుల నుంచి వెలువడుతున్నాయి.
స్వల్పంగా పెరిగినా...
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా పైకి ఎగబాకాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 64,110 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 69,880 రూపాయలుగా నమోదయింది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 84,100 రూపాయలుగా ఉంది.