Gold Price Today: రన్నింగ్ మొదలు పెడితే ఇక ఆగుతుందనుకుంటే బంగారం విషయంలో భ్రమేనప్పా
బంగారం ధరలు మరింత పెరగనున్నాయి. బంగారంతో పాటు వెండి కూడా హై స్పీడ్ తో పరుగులు తీస్తుంది.
బంగారం ధరలు మరింత పెరగనున్నాయి. రోజురోజుకూ ధరలు ఆకాశం వైపు చూస్తున్నాయి. బంగారంతో పాటు వెండి కూడా హై స్పీడ్ తో పరుగులు తీస్తుంది. జాతీయ రహదారిపై కాస్ట్లీ కారు ప్రయాణించినట్లు ఎక్కడా స్పీడ్ బ్రేకర్లు లేకుండా బంగారం, వెండి దూసుకు పోతుంది. ఈ రెండింటి వస్తువుల డిమాండ్ మరి దేనికీ లేవు. అందుకే పసిడి, వెండి ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. తగ్గేదేలేదన్నట్లు బంగారం పరుగులు పెడుతున్నా ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరనట్లు కొనుగోలుదారులు కూడా ఉన్నారు.
ఎలాగైనా కొనుగోలు చేసి...
బంగారం గతంలో ఒక అపురూపమైన వస్తువు. ఎంతగా ప్రేమించినా.. దానిని సొంతం చేసుకునేందుకు కొంత వెనకాడేవారు. కానీ నేడు గోల్డ్ అంటే చాలు తనువు పులకరించిపోతుంది. బంగారం కొనేయాలంటే కొనేసినట్లే.. క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లు చేసే వాళ్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అదే సమయంలో జ్యుయలరీ దుకాణాలు ఈఎంఐ పద్ధతి అమలు చేస్తుండటంతో నెలకు కొంత జ్యుయలరీ షాపులో చెల్లించి బంగారాన్ని సొంతం చేసుకోవడానికి ఎక్కువ మంది ఉవ్విళ్లూరుతున్నారు.
మరోసారి పెరిగి....
అదే సమయంలో పెట్టుబడిగా కూడా బంగారం, వెండి వస్తువులను చూడటం అలవాటుగా మార్చుకున్నారు. స్టేటస్ సింబల్ గా కూడా మారిపోవడంతో ఇక దీని పరుగుకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తాజాగా మరోసారి దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65,760 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,740 రూపాయలుగా నమోదయి ఉంది. కిలో వెండి ధర ఆల్ టైం హైకి వెళ్లి 87,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.