Gold Prices Today : ధరలు పెరుగుతాయని ముందుగా ఊహించిందే కానీ.. ఈరోజు మాత్రం

ఈరోజు దేశంలో బంగారం స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి

Update: 2024-02-20 04:03 GMT

బంగారం ధరలు పెరుగుతాయని ముందుగా ఊహించిందే. తగ్గుతుంటే సంతోషపడ్డాం కాని పెరుగుతుందని అందరూ అనుకున్నదే. మార్కెట్ విశ్లేషకుల అంచనా కూడా అలాగే వినిపించింది. పెళ్లిళ్ల సీజన్ కావడం, డిమాండ్ పెరగడంతో పసిడి ధరలకు రెక్కలు వస్తాయని భావించారు. అనుకున్నట్లే ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పసిడి ధరలు మరింత పెరిగే అవకాశముందన్న వార్తలతో కొనుగోలుదారులు కొంత భయపడుతున్నా కొనుగోలు చేయక తప్పని పరిస్థితి.

పెళ్లిళ్లకు, శుభకార్యాలకు..
పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయడం తప్పనిసరిగా మారింది. భారతీయ సంస్కృతిలో అది సంప్రదాయంగా మారడంతో బంగారం కొనుగోళ్లు ఈ మూడు నెలలు విపరీతంగా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతూ వస్తున్నారు. అందుకే పెళ్లిళ్లకు, శుభకార్యాలు ముందుగా ఫిక్స్ చేసుకున్న వాళ్లు బంగారాన్ని కొనుగోళ్లు చేయడం మంచిదన్న సూచనలు కూడా వినిపించాయి. రాను రాను బంగారం ఖరీదైన వస్తువుగా మారడంతో తమ స్తోమతకు సరిపోయేటంత మాత్రమే కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు.
నేటి ధరలు...
ీఈరోజు దేశంలో బంగారం స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,640 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,680 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర మాత్రం 77,400 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News