Gold Prices : ఫరవాలేదు.. కొంత వరకు తగ్గినట్లే.. ఎగబడి కొనేయొచ్చు
మగువలకు శుభవార్త. బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగానే తగ్గాయి
మగువలకు శుభవార్త. బంగారం ధరలు తగ్గాయి.. ఇది నిజం. బంగారం ధరలు ప్రతి రోజూ పెరుగుతూనే ఉంటాయి. ధరలు తగ్గడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. అనేక కారణాలతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనపడుతుంటాయి. గత రెండు రోజుల నుంచి వరసగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు శాంతించాయి. కొంత వరకూ బాగానే తగ్గాయని చెప్పాలి. అయితే గత రెండు రోజుల నుంచి పెరిగిన ధరతో పోలిస్తే నేడు తగ్గిన బంగారం ధర స్వల్పంగానే చూడాలి.
డిమాండ్ ను బట్టి...
బంగారం, వెండి అంటే అదో క్రేజ్. వాటిని కొనుగోలు చేయనిదే నిద్రపట్టదు కొందరికి. ముఖ్యంగా మహిళలకు ఈ రెండిటింటినీ సొంతం చేసుకోవాలన్న తపన ఎక్కువగా ఉంటుంది. అందుకే బంగారం, వెండికి డిమాండ్ అధికంగా ఉంటుంది. ఎంత బంగారం, వెండి తమ ఇంట్లో అంత గౌరవం సమాజంలోనూ, చుట్టపక్కల చివరకు బంధువుల వద్ద నుంచి కూడా లభిస్తుంది. అందుకే బంగారాన్ని ఎగబడి మరీ కొంటుంటారు. అందుకే బంగారం ధరలు ఎప్పడూ ప్రియంగానే ఉంటాయి.
తగ్గిన ధరలు...
తాజాగా దేశంలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రెండు వందల రూపాయలు తగ్గింది. వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధరపై వందరూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 58,100 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,380 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 77,000 రూపాయలుగా నమోదయింది.