Gold Rates : మగువలకు గుడ్ న్యూస్.. కింద చూపులు చూస్తున్న బంగారం ధరలు

ఈరోజు మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మహిళలు ఎక్కువగా ఇష్టపడే బంగారం ధరలు కొంత దిగివచ్చాయి.

Update: 2023-12-10 02:27 GMT

పసిడి ధరలు పెరుగుతూనే ఉంటాయి. దాని పరుగులు ఆపడం ఎవరి తరమూ కాదు. బంగారం ధరలను అదుపు చేయడం ఎవరి చేతుల్లోనూ ఉండదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులను బట్టి, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గుదలలు ఉంటాయి. అందుకే మార్కెట్ లో బంగారం ధరలు ప్రియంగా మారుతున్నప్పటికీ కొనుగోళ్లుదారులకు తప్పనిసరి కావడంతో దాని డిమాండ్ కు అనుగుణంగా ధరలు పెరుగుతున్నాయి.

బంగారు ఆభరణాలు...
దక్షిణ భారత దేశంలో బంగారు ఆభరణాలు ఎక్కువగా వినియోగిస్తారు. గోల్డ్ బాండ్స్ ను తక్కువగా యూజ్ చేస్తారు. అదే విదేశాల్లో గోల్డ్ బాండ్స్ కు ఎక్కువ గిరాకీ ఉంటుంది. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి దానిని దగ్గర పెట్టుకుని, భద్రపర్చేందుకు ఎవరూ ఇష‌్టపడరు. అందుకే విదేశాలు, ఉత్తర భారత దేశంలో గోల్డ్ బాండ్స్ ను ఎక్కువగా కొనుగోలు చేయడం అలవాటుగా మారింది. అయితే అందుకు భిన్నంగా దక్షిణ భారతదేశంలో బంగారు ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.
వెండి భారీగా...
ఈరోజు మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మహిళలు ఎక్కువగా ఇష్టపడే బంగారం ధరలు కొంత దిగివచ్చాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,150 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,350 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. వెండి ధరలు కూడా చాలా వరకూ తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధరపై రెండు వేల రూపాయల వరకూ తగ్గింది. దీంతో కిలో వెండి ధర 78,000 రూపాయలకు దిగి వచ్చింది.


Tags:    

Similar News