Indian Railways: ఇండియన్ రైల్వే కొత్త రూల్.. ఈ తప్పు చేస్తే ఇక జైలుకే..

Indian Railways Rule: దేశంలోని చాలా మంది ప్రయాణం చేసేందుకు ఇండియన్‌ రైల్వేను ఆశ్రయిస్తుంటారు. భారతీయ రైల్వేలు

Update: 2023-12-29 15:28 GMT

Indian Railways Rule

Indian Railways Rule: దేశంలోని చాలా మంది ప్రయాణం చేసేందుకు ఇండియన్‌ రైల్వేను ఆశ్రయిస్తుంటారు. భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. అలాగే ఆసియాలో రెండవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు వివిధ రైల్వే మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. రైలు సేవలను పెంచడమే కాకుండా, భారతీయ రైల్వే ప్రయాణీకుల సేవలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుంది. ప్రయాణికుల సేవ భాగాలలో ఒకటి పరిశుభ్రత. రైళ్లు, స్టేషన్ల పరిశుభ్రతపై ప్రయాణికులు చాలా ఫిర్యాదులు చేస్తున్నారు.

అయితే రైలు లేదా స్టేషన్‌ను ఎవరు మురికిగా చేస్తారు? సహజంగానే ప్రయాణికులు. ప్రతి మూలకు డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేయడం నుండి స్టేషన్లలో ప్రకటనల వరకు మనం ఎంత ప్రయత్నించినా చెత్త సమస్య పరిష్కారం కావు. రైళ్లు, స్టేషన్లలో పరిశుభ్రతను కాపాడేందుకు భారతీయ రైల్వే కఠిన చర్యలు తీసుకుంటోంది. స్టేషన్‌లో లేదా రైలులో చెత్త విసిరితే కఠిన శిక్షలు పడతాయి. జరిమానా మాత్రమే కాదు.. జైలుకు కూడా వెళ్లవచ్చు.

రైళ్లలో లేదా స్టేషన్లలో చెత్తను వేస్తే ప్రయాణికులపై ఇప్పటికే కఠినమైన జరిమానాలు ఉన్నాయి. తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. IRCTC కూడా అన్ని స్టేషన్‌ల ఇన్‌ఛార్జ్‌లకు నోటీసులు పంపింది. ఆ క్రమంలోనే స్టేషన్లు, రైళ్లను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను నిర్దేశించిన డస్ట్‌బిన్‌లలో వేయాలని సూచించింది. ఇక నుంచి స్టేషన్‌లో చెత్త విసిరినా, కదులుతున్న రైలులో నుంచి ఫుడ్ ప్యాకెట్లు, మరేదైనా విసిరినా కఠిన శిక్షలు తప్పవు. ఇప్పటి వరకు కేవలం జరిమానా చెల్లించి తప్పించుకునేవారు. ఈసారి కూడా అరెస్టులు జరిగే అవకాశం ఉంది. రైల్వే చట్టంలోని సెక్షన్ 145(సి) కింద ప్రయాణికుడిని అరెస్టు చేస్తారు. 500 వరకు జరిమానా, గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

రైల్వే స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ పరిశుభ్రత కోసం స్టేషన్ నుండి స్టేషన్‌కు వెళ్తుంది. రైల్వే లైన్ వెంబడి చెత్త వేయకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ నిఘా ఉంచుతుంది.

Tags:    

Similar News