Gold Prices Today : గోల్డ్ కొనుగోలు చేసేందుకు ఇది సరైన సమయమేనా? వెయిట్ చేయడం మంచిదా?

బంగారం కొనుగోలు చేయడం మాత్రం మానుకోవద్దని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Update: 2024-06-19 03:37 GMT

పుత్తడి ధరలు ప్రియంగానే ఉంటాయి. వాటి ధరలు తగ్గవన్న సంగతి అందరికీ తెలిసిందే. తగ్గినప్పటికీ స్వల్పంగానే తప్ప భారీగా తగ్గడం అనేది అరుదుగానే జరుగుతుంటుంది. సీజన్ లో అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. బంగారం ధరలు పెరగడమే తెలుసు. తగ్గడం అనేది అరుదు. అలాంటిది ఇప్పుడు సీజన్ కాకపోయినా పెద్దగా ధరలు దిగి రావడంలేదు. వినియోగదారులకు అందుబాటులోకి రాక పోవడంతో కొనుగోలు చేయాలా? వద్దా? గోల్డ్ కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయమా? కాదా? అన్న ఆలోచనలో ఉన్నారు.

సొంతం చేసుకోవడం...
అయితే బంగారం కొనుగోలు చేయడం మాత్రం మానుకోవద్దని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ధరలు తగ్గుతాయని వెయిట్ చేస్తుంటే మరింత ధరలు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. అందుకే డబ్బులున్నప్పుడు, కొనుగోలు చేయాలని భావించినప్పుడు వాటిని సొంతం చేసుకోవడమే ఉత్తమమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇక సీజన్ ప్రారంభమయిందంటే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశముందని కూడా మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నేటి ధరలు ఇవీ...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా కొంచెం పెరిగి నిరాశ పర్చాయి. అయితే భారీ స్థాయిలో పెరగకపోవడం ఒకింత ఊరట కలిగించే విషయమేనంటున్నారు వ్యాపారులు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,490 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,540 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 95,600 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News