Paytm: తప్పని కష్టాలు.. పేటీఎంకు రూ.5.49 కోట్ల జరిమానా
పేటీఎంకు కష్టాలు మరింతగా వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన చర్యల కారణంగా తీవ్ర ఊబిలో..
పేటీఎంకు కష్టాలు మరింతగా వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన చర్యల కారణంగా తీవ్ర ఊబిలో కూరుకుపోయిన పరిస్థితి నెలకొంది. కేవైసీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున పేటీఎం పేమెంట్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి పేటీఎం ప్రతి రోజు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇక తాజాగా మరో చిక్కు వచ్చి పడింది. పేటీఎంపై మరోసారి చర్యలు తీసుకున్నారు. మనీలాండరింగ్ కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రూ.5.49 కోట్ల జరిమానా విధించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మనీలాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. ఎఫ్‌ఐయూ తమ వ్యాపారానికి సంబంధించిన కొన్ని యూనిట్లు, కంపెనీలకు సంబంధించి చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి దర్యాప్తు సంస్థల నుండి సమాచారాన్ని పొందింది.
అక్రమ లావాదేవీలు
ఈ యూనిట్ల ఖాతాలు Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని కింద చట్టవిరుద్ధమైన లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం అంటే నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని Paytm పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల ద్వారా వేరే చోటికి పంపుతున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద బాధ్యతలను ఉల్లంఘించినందుకు Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా రూ.5.49 కోట్ల జరిమానా విధించింది.