Gold Prices : పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. కొనుగోలు దారులకు భారీ ఊరట

పెరుగుతున్న బంగారం ధరలకు కొంత కళ్లెం పడింది. పది గ్రాముల బంగారం ధరపై 490 రూపాయలు వరకూ తగ్గింది.

Update: 2023-12-17 02:04 GMT

gold prices today

బంగారం ధరల్లో ఇటీవల భారీగా పెరుగుగుదల కనిపిస్తుంది. కారణాలు అనేకం ఉన్నప్పటికీ బంగారం ధరలకు కళ్లెం గత కొద్ది రోజులుగా పడటం లేదు. దీంతో పసిడిని కొనుగోలు చేయాలనుకునేవారు ఎక్కువ ధరను వెచ్చించి తక్కువ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి వస్తుంది. అందులో పండగ సీజన్ కావడంతో ఖచ్చితంగా పుత్తడిని కొనుగోలు చేయాల్సి వస్తుంది. అందుకే ధరలను లెక్క చేయకుండా.. పెళ్లిళ్ల కోసం కొనుగోలు చేయాల్సి వస్తుందని కొనుగోలుదారులు పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు.

అనేక కారణాలతో...
అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, ఇజ్రాయిల్ - హమాస్ యుద్ధం, కస్టమ్స్ డ్యూటీని పెంచడం, దిగుమతులను తగ్గించడం కూడా బంగారం ధరలు పెరగడానికి కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో వచ్చిన మార్పుల కారణంగా కూడా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని చెబుతుంటారు. అయినా తప్పనిసరి పరిస్థితిలో బంగారాన్ని కొనుగోలు చేయాల్సి రావడం బ్యాడ్ లక్.
భారీ తగ్గుదల...
అయితే పెరుగుతున్న బంగారం ధరలకు కొంత కళ్లెం పడింది. పది గ్రాముల బంగారం ధరపై 490 రూపాయలు వరకూ తగ్గింది. ఇది ఇటీవల కాలంలో భారీ తగ్గుదల అని వ్యాపారులు చెబుతున్నారు వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. వెండి కిలో ధరపై ఎనిమిది వందల రూపాయలు తగ్గిస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,300 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,510 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 79,700 రూపాయలుగా ట్రెండ్ అవుతుందని మార్కెట వర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News