రోజుకు 5.6 కోట్లు దానం చేసిన శివనాడార్‌.. అంబానీ ఏ స్థానంలో అంటే

Hurun India Philanthropy List 2023: ఇటీవల హురూన్ ఇండియా ఫిలాంత్రపీ జాబితా-2023 విడుదలైన విషయం

Update: 2023-11-07 15:10 GMT

Hurun India Philanthropy List 2023: ఇటీవల హురూన్ ఇండియా ఫిలాంత్రపీ జాబితా-2023 విడుదలైన విషయం తెలిసిందే. దిగ్గజ భారత ఐటీ కంపెనీలు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల వ్యవస్థాపకులు, వారి కుటుంబాలు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇండియాలోనే అత్యంత మానవత్వాన్ని చాటుకున్నారు. భారత మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు శివ్ నాడార్ గత 5 ఏళ్లలో మూడోసారి మొదటి స్థానంలో నిలువడం గమనార్హం. ఈ 2023 ఆర్థిక సంవత్సరంలో నాడార్ ఏకంగా రూ. 2042 కోట్లు విరాళం ఇచ్చినట్లు హురూన్‌ జాబితా వెల్లడించింది.

అంబానీ ఏ స్థానంలో ఉన్నారంటే..

అయితే నాడార్ రోజుకు సగటున రూ. 5.6 కోట్ల చొప్పున విరాళం చేసినట్లు హురూన్ ఇండియా వెల్లడించింది. ఇక నాడార్ తర్వాత స్థానాన్ని విప్రోకు చెందిన అజీం ప్రేమ్‌జీ అండ్ ఫ్యామిలీ ఉంది. ఈ ఏడాదిలో వీరు చేసిన విరాళం రూ.1774 కోట్లుగా ఉందని నివేదించింది జాబితా. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ అండ్ ఫ్యామిలీ ఏ మాత్రం తగ్గలేదు. ఈయన కూడా రూ. 376 కోట్లు దానం చేసి ఈ జాబితాలో చేరిపోయారు.

2023 ఆర్థిక సంవత్సరంలో విరాళాలు ఎన్ని..?

కాగా, 2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 119 భారతీయులు రూ. 5 కోట్లకుపైగా విరాళం అందించినట్లు హురూన్ ఇండియా వెల్లడించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య 11 పెరిగింది. ఈ లిస్ట్‌లో ఈసారి 25 మంది కొత్త వారు ఎంటర్‌ అయ్యారు. వీరిలో ఇన్ఫోసిస్ కోఫౌండర్ కే. దినేశ్ రూ. 47 కోట్లతో టాప్‌లో ఉన్నారు.

ఆ నలుగురికి చోటు..

ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుల్లో ఈ జాబితాలో మొత్తం నలుగురికి చోటు దక్కింది. వారిలో నందన్ నీలేకని రూ.189 కోట్ల దానంతో 8వ స్థానంలో ఉండగా, ఆయన సతీమణి, ఉదారవాది రోహిణి నీలేకని రూ. 170 కోట్ల విరాళంతో టాప్-10లో ఉన్నారు. టాప్‌-10లో ఏకైక మహిళ ఈమె కావడం విశేషం. ఇక గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలీ రూ. 285 కోట్లతో ఐదో స్థానంలో ఉండగా, నాలుగో స్థానంలో కుమార్ మంగళం బిర్లా అండ్ ఫ్యామిలీ 287 కోట్ల రూపాయలతో ఉంది. ఇక బజాజ్ ఫ్యామిలీ రూ. 264 కోట్ల విరాళాలతో ఆరో స్థానంలో ఉండగా, అనిల్ అగర్వాల్ అండ్ ఫ్యామిలీ రూ.241 కోట్లతో ఏడో స్థానంలో ఉన్నారు. 9వ స్థానంలో సైరస్ పూనావల్లా అండ్ అడర్ పూనావల్లా రూ. 179 కోట్లు ఉన్నారు.

Tags:    

Similar News