Gold Prices : పసిడి ధర తగ్గే ఛాన్సే లేదు... ఒక్క సారి పెరిగిందంటే అంతే మరి

బంగారం కొనుగోలుదారులకు ఒకరకంగా శుభవార్త అని చెప్పాలి. పసిడి ధరల్లో పెద్దగా మార్పు లేదు. స్వల్పంగానే ధరలు పెరిగాయి.

Update: 2024-01-25 04:19 GMT

బంగారం కొనుగోలుదారులకు ఒకరకంగా శుభవార్త అని చెప్పాలి. పసిడి ధరల్లో పెద్దగా మార్పు లేదు. స్వల్పంగానే ధరలు పెరిగాయి. బంగారం ధరలు పెరిగాయంటే వందల రూపాయలు పెరుగుతాయి. గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న తంతు ఇది. అయితే ఈరోజు మాత్రం ధరలు శాంతించాయి. పెద్దగా పెరుగుదల కనిపించలేదు. అలాగని స్థిరంగానూ లేవు. మరో రెండు నెలలు పాటు పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో కొనుగోళ్లు కూడా అధికంగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతాయని చెబుతున్నారు.

అనేక కారణాలు...
బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులను అనుసరించి, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి మారకం విలువ వంటి కారణాలతో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. అయితే భారీగా బంగారం ధరలు తగ్గే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక్కసారి పెరిగిందంటే బంగారం ఇక తగ్గడం అనేది జరగదు. తగ్గితే పదో పరకో తప్పించి పెద్ద మొత్తంలో పూర్తిగా పతనమయ్యే అవకాశముండదు. అందుకే ఇప్పటి ధరలను అనుసరించి కొనుగోలు చేయక తప్పని పరిస్థితి.
ఈరోజు ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే బుధవారం తో పోల్చుకుంటే పది గ్రాముల బంగారం ధరపై ముప్ఫయి రూపాయలు మాత్రమే పెరిగింది. వెండి ధరలు కూడా నిలకడగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,750 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,000 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర మాత్రం 76,800 రూపాయలుగా నమోదయింది.


Tags:    

Similar News