LIC: 2023లో ఎల్‌ఐసీ తీసుకువచ్చిన బెస్ట్‌ స్కీమ్స్‌ ఇవే

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ప్రపంచంలోనే నాల్గో అతి పెద్ద జీవిత బీమా సంస్థ. మన దేశంలో

Update: 2023-12-21 05:52 GMT

LIC

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ప్రపంచంలోనే నాల్గో అతి పెద్ద జీవిత బీమా సంస్థ. మన దేశంలో నంబర్ వన్. ఈ సంస్థ దేశ వ్యాప్తంగా జనాలను ఎంతగానో ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే దీనిలో క్లెయిమ్ సెటిల్ మెంట్ రేషియో 98.74శాతం ఉంది. కాగా, ఎల్ఐసీ ఇప్పుడు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా అనేక పథకాలను తీసుకొస్తోంది. ఈ ఏడాదిలో దాదాపు ఐదు పథకాలు ఈ లక్ష్యంతోనే ప్రారంభించింది. వీటిల్లో అధిక రాబడితో పాటు పన్ను ప్రయోజనాలు కూడా ఉంటున్నాయి. ఆ ఎల్ఐసీ ఐదు పథకాల వివరాలు ఇప్పుడు చూద్దాం.

♦ ఎల్ఐసీ జీవన్ శాంతి పథకం: ఎల్ఐసీ జీవన్ శాంతి అనేది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, సింగిల్ ప్రీమియం డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. ఇది పాలసీ మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత సాధారణ చెల్లింపులను పొందేందుకు కాలక్రమేణా నిధులను సేకరించవచ్చు. ఇది పాలసీదారులకు పదవీ విరమణ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. దీనిలో ఫండ్‌లకు గరిష్ట పరిమితి లేదు. ఫ్లెక్సిబుల్ ప్రీమియం చెల్లింపులు చేసిన తర్వాత వ్యక్తులు యాన్యుటీ చెల్లింపుల ద్వారా జీవితకాల ఆదాయాన్ని పొందేందుకు అవకాశ ఉంటుంది. 2023 జనవరిలో ఎల్ఐసీ జీవన్ శాంతి ప్లాన్స్ (858) కోసం యాన్యుటీ రేట్లను పెంచింది.

♦ ఎల్ఐసీ జీవన్ కిరణ్ పాలసీ: రక్షణ, పొదుపులను సులభతరం చేసే సంయుక్త చొరవతో 2023 జూలై లో జీవన్ కిరణ్ పథకాన్ని (870) ఎల్ఐసీ ప్రారంభించింది. ఇతర అధిక-రాబడి పాలసీల మాదిరిగానే, సింగిల్ ప్రీమియం చెల్లింపులు అలాగే సాధారణ ప్రీమియం పాలసీ చెల్లింపులు వాయిదాతో అనుమతించబడతాయి. పాలసీ విలువను బట్టి హామీ ఇవ్వగల కనీస మొత్తం రూ. 15,00,000 వరకూ ఉంటుంది. గరిష్ట మొత్తానికి పరిమితి లేదు. పాలసీకి వ్యతిరేకంగా రుణ సౌకర్యం, గ్యారెంటీ సరెండర్ విలువ, డెత్ బెనిఫిట్ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, సెటిల్‌మెంట్ బెనిఫిట్స్ లభిస్తాయి.

♦ ఎల్ఐసీ ధన్ వృద్ధి పథకం: ధన్ వృద్ధి (869) అనేది నాన్-లింక్డ్ సేవింగ్స్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఎండోమెంట్ ప్లాన్‌లతో పాలసీదారులకు పొదుపు క్రమశిక్షణను కలిగిస్తుంది. మెచ్యూరిటీ బెనిఫిట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్, సింగిల్ ప్రీమియం, ట్యాక్స్ బెనిఫిట్స్ వంటి అనేక ప్రయోజనాలతో పాటు పాలసీ హోల్డర్‌లు స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే టర్మ్‌ని నిర్ణయించుకోవడానికి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అయితే, హామీ ఇవ్వగల కనీస మొత్తం రూ. 1,25,000 గరిష్టంగా రూ. 5,000 గుణిజాల్లో ఎంతైనా ఉండవచ్చు నిర్ణయించిన మెచ్యూరిటీ వ్యవధి ముగిసే సమయానికి అధిక రాబడిని పొందేలా చూసుకోవచ్చు.

♦ ఎల్ఐసీ జీవన్ ఆజాద్ పాలసీ: జనవరి 20, 2023న ప్రారంభించబడిన జీవన్ ఆజాద్ ఇన్సూరెన్స్ పాలసీ (868) అనేది పరిమిత ప్రీమియంతో లభించే ప్లాన్. జీవన్ ఆజాద్ పన్ను ఆదా, మెరుగైన రాబడి, మెచ్యూరిటీ ప్రయోజనాలు, మరణ ప్రయోజనాలు వంటి అనేక ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది. పాలసీదారులు గరిష్టంగా 50 సంవత్సరాల మెచ్యూరిటీ కాలవ్యవధితో, 70 సంవత్సరాల వయస్సు వరకు తీసుకోవచ్చు. రైడర్ ప్రయోజనాలలో అదనపు ఎంపికలు యాక్సిడెంట్ డెత్, లేదా వైకల్య ప్రయోజనం తీసుకోవచ్చు. ఎల్ఐసీ ప్రీమియం మినహాయింపు పొందవచ్చు. రెండేళ్లకు మించి ప్రీమియంలను తప్పకుండా చెల్లించినట్లయితే, పాలసీదారు రుణ సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంటుంది.

Tags:    

Similar News