Gold Prices Today : బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త.. సండే కొనుగోలుకు సరైన టైం

ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2024-06-30 04:38 GMT

పసిడి ధరలు దిగివస్తాయనుకుంటే మళ్లీ పరుగును ప్రారంభించాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయని ఆనందం పడిన వారికి ధరలు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. అన్ సీజన్ కావడంతో ధరలు తగ్గుతాయని, ఇంకా తగ్గితే కొనుగోలు చేద్దామని వెయిట్ చేసిన వారికి నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

గిరాకీ తగ్గని...
బంగారం, వెండి ధరలకు ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఎందుకంటే అవి స్టేటస్ సింబల్ గా మారాయి. కొనుగోలు శక్తి పెరగడంతో ధరలు పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. మధ్యతరగతి ప్రజలు కూడా తమకు అవసరమైనప్పుడే కాకుండా, వీలున్నప్పుడు బంగారరం, వెండిని కొనుగోలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. ఎందుకంటే మనకు భవిష్యత్ లో భద్రత కల్పిస్తుందన్న నమ్మకంతో బంగారాన్ని సొంతం చేసుకుంటున్నారు. సులువుగా నగదుగా మార్చుకుని తమ అవసరాలను తీర్చుకునే ఉపయోగపడే వస్తువు కావడంతో డిమాండ్ మరింత అధికమయింది.
ధరలు ఇలా...
గత కొద్ది రోజులుగా తగ్గుతున్న ధరలు రెండు రోజుల నుంచి పెరుగుతున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగించే అంశమే అయినప్పటికీ ఈరోజు పసిడిప్రియులకు గుడ్ న్యూస్ అందింది. ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,250 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,280 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 94,500 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News