Gold Prices Today : ఎన్నాళ్లకెన్నాళ్లకు ఇలా కొద్దిరోజులు ఉండిపోతే ఎంత బాగుంటుంది?
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చాలా రోజుల తర్వాత ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు
బంగారం ధరలు ఎప్పుడూ తగ్గవు. తగ్గినప్పటికీ అది కంటితుడుపుగానే కనిపిస్తాయి. పెరిగితే కన్నీళ్లు తెప్పిస్తాయి. అంత స్థాయిలో భారీగా ధరలు పెరుగుతాయి. అందుకే బంగారం, వెండి ధరలు ప్రతి రోజూ చూసేందుకు కొంత గుండెనిబ్బరం కావాలి. ప్రతి రోజూ పసిడి, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో ప్రతి రోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.
ధరలు పెరగకపోవడమే...
అక్షర తృతీయ సమయంలోనూ పెద్దగా ధరలు పెరగలేదు. అందులో కొంత ఊరట కలిగించే అంశమే. అందులో ప్రస్తుతం మూఢమి నడుస్తుంది. మూడు నెలల పాటు మంచి ముహూర్తాలు లేవు. దీంతో కొనుగోళ్లు తగ్గడంతోనే ధరలు పెరగడం లేదన్న వాదన కూడా ఒకవైపు వినిపిస్తున్నప్పటికీ బంగారానికి సీజన్ ఏంటి బాసూ అంటూ అనేక మంది సెటైర్ గా ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. ఇందుకు కారణం ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు పసిడి, వెండిని కొనుగోలు చేయడం దక్షిణ భారత దేశంలో అలవాటుగా మార్చుకున్నారు.
నేటి ధరలు ఇవీ...
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చాలా రోజుల తర్వాత ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించకపోవడం నిజంగా కొనుగోలుదారులకు శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే ధరలు పెరగకపోవడమే గుడ్ న్యూస్ అనుకోవాల్సిన పరిస్థితి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,250 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,360 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 90,500 రూపాయలకు చేరుకుంది.