Gold Prices : చెప్పలేదా.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం.. కొద్దిగా తగ్గిన వెండి ధరలు

ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి

Update: 2023-12-27 01:50 GMT

 gold prices

బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. అందుకే తగ్గినప్పుడే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బంగారం కొనుగోలు చేయడానికి వేళాపాళా చూడాల్సిన పనిలేదు. ఎప్పుడు ధరలు తగ్గితే అప్పుడు కొనుగోలు చేయడమే బెటర్ అని మార్కెట్ నిపుణులు నిత్యం సూచిస్తుంటారు. పసిడికి ఉన్న డిమాండ్ అలాంటింది. ఎప్పుడూ గిరాకీ తగ్గని వస్తువు ఏదైనా ఉంది అంటే అది బంగారమేనని చెప్పక తప్పదు. అలాంటి బంగారం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మనం అనుకున్న ధరకు కొనుగోలు చేయడం వీలవుతుంది.

పెరిగిన ధరలతో...
అంతర్జాతీయ మార్కెట్ లో పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, దిగుమతులు తగ్గించడం, కస్టమ్స్ డ్యూటీ పెంచడం వంటి కారణాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి. కొత్త ఏడాది ప్రారంభానికి ముందే బంగారం ధరలకు రెక్కలు రావడంతో పసిడి ప్రియుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. పండగలు, పబ్బాలకు బంగారాన్ని కొనుగోలు చేయడం ఎలా అన్న ఆవేదన కొనుగోలుదారుల్లో కనపడుతుంది. ఒక్కసారిగా ధరలు పెరగడం గోల్డ్ లవర్స్ ను షాకింగ్ కు గురి చేస్తుంది.
ధరలు ఇలా...
గత రెండు రోజుల నుంచి పసిడి ధరలు స్థిరంగా ఉండటంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నంత సేపు లేదు. ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 220 రూపాయల వరకూ పెరిగింది. కిలో వెండి ధరపై మూడు వందల రూపాయల వరకూ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 58,400 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,710 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర మాత్రం 79,500 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News