Gold Prices : ప్రియమైన వస్తువు.. తగ్గిందని సంబరపడకండి.. ముందుంది?

ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై నాలుగు వందల రూపాయలు తగ్గింది.

Update: 2023-12-18 03:31 GMT

బంగారం ధరలు పెరగడం అనేదే మనం తరచూ వింటాం. తగ్గడం అనేది తక్కువగా వింటుంటాం. తగ్గడం అనేది తక్కువ సార్లు.. స్థిరంగా అనేది ఎక్కువసార్లు.. పెరిగింది అనేది అనేకసార్లు మన చెవిలో పడుతుంది. అది బంగారం విషయంలోనే మనం చూస్తుంటాం. ఎప్పుడూ డిమాండ్ తగ్గని వస్తువు కావడంతో సహజంగా ధరలు పెరుగుతూనే ఉంటాయి. అయితే మార్కెట్ నిపుణులు ఈ ఏడాది చివరి నాటికి 65 వేల రూపాయలకు చేరుకుంటుందని చెబుతున్నప్పటికీ అంత వరకూ చేరలేదు. అందులో కొంతలో కొంత సంతోషం.

పెరగడమే తప్ప...
బంగారం ఎప్పుడూ ప్రియంగానే ఉంటుంది. మహిళలకు అత్యంత ఇష్టమైన వస్తువు కావడంతో దానికి ఎన్నడూ తిరుగుండదు. ధరలు పెరిగినంత మాత్రాన బంగారాన్ని కొనుగోలు చేయకుండా ఉండలేరు. దానిని స్టేటస్ సింబల్ గా చూడటం మన సమాజంలో ఒక అలవాటుగా మారింది. అలాగే సంప్రదాయ వస్తువుగా మారడంతో కూడా శుభ కార్యాలకు తప్పనిసరి పరిస్థితుల్లో దానిని కొనుగోలు చేయాల్సి వస్తుంది. అందుకే ధరలను పెద్దగా పట్టించుకోకుండా కొనుగోలు చేస్తూనే ఉంటారు. అందుకే పసిడి ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. అయితే మధ్యలో ధరలకు బ్రేక్ పడినా అది తాత్కాలికమేనని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వెండి స్థిరంగా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. కొనుగోలుదారులకు స్వల్ప ఊరట కలిగించాయి. పెళ్లిళ్ల సీజన్ లో ఈ మాత్రం ధరలు తగ్గినా చాలు అనే తృప్తి పడే వాళ్లు అనేక మంది ఉన్నారు. ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై నాలుగు వందల రూపాయలు తగ్గింది. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 57,300 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,150 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర 79,700 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News