Gold Prices : ఎంత తీపికబురు.. ఇలా రోజు దిగివస్తుంటే అంతకన్నా ఏం కావాలి?

ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 380 రూపాయలు తగ్గింది. వెండి స్థిరంగా కొనసాగుతుంది.

Update: 2024-01-18 04:25 GMT

బంగారం ధరలు తగ్గాయంటే ఎంత సంతోషమో చెప్పలేం. తమ జేబులో డబ్బులున్నట్లే ఫీలయిపోతారు చాలా మంది. కొనేది తక్కువయినా బంగారం ధరలు తగ్గుతూనే ఉండాలని కోరుకుంటారు. పసిడి మనకు అందుబాటులో ఉంటే మంచిదని భావిస్తారు. అది భారతీయుల మనస్తత్వం. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఎక్కువగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం అలవాటు. సంప్రదాయం. అందుకే ధరలు ప్రతి రోజూ తగ్గితే బాగుంటుందని అనుకుంటారు.

ఇంకా తగ్గితే ..?
అయితే బంగారం ధరలు మనం ఊహించినట్లు ఉండవు. అవి ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు తగ్గి మనల్ని ఊరిస్తుంటాయి. రా రమ్మంటూ పిలుస్తుంటాయి. డాలర్ విలువతో రూపాయి తగ్గితే బంగారం ధరలు పెరుగుతాయి. అదే డాలర్ విలువతో కొంత రూపాయి పెరుగుదల కనిపిస్తే బంగారం ధరలు తగ్గుతుంటాయి. వీటితో పాటు అంతర్జాతీయ ద్రవ్యోల్బణం కూడా ఒక కారణం అని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం ప్రభావం కూడా బంగారం ధరలపై పై పడుతుంది.
భారీగా తగ్గి...
ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై మూడు వందల ఎనభై రూపాయలు తగ్గింది. వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. నిలకడగానే కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,700 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,950 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగుతూ ప్రస్తుతం 77,400 రూపాయలు పలుకుతుంది.
Tags:    

Similar News