Gold Prices Today : లక్ష దాటేసిన వెండి.. బంగారానిది కూడా అదే బాట

ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా అదే బాట పయనిస్తున్నాయి

Update: 2024-05-21 03:01 GMT

బంగారం, వెండి ధరలుకు కళ్లెం పడేటట్లు కనిపించడం లేదు. మార్కెట్ లో వాటి ధరలు దూసుకుపోతున్నాయి. ధరలు పెరుగుతాయని ముందే ఊహించిన వారు కొనుగోలు చేసి పెట్టుకుంటే మంచిదని ఇప్పటికే మార్కెట్ నిపుణులు హెచ్చరించారు. అయినా ఎక్కోడ ఆశ.. ధరలు తగ్గుతాయోమో కొనుగోలు చేద్దాములే అని వెయిట్ చేసిన వారికి నిరాశ కలిగించేలా ధరలు తారాజువ్వలా దూసుకెళుతున్నాయి. డిమాండ్ మరింత పెరిగిపోవడంతో పాటు కావాల్సిన బంగారం లేకపోవడం వల్ల కూడా ధరలు పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.

నిల్వలు పెరగకపోవడం...
సాధారణంగా బంగారం నిల్వలు పెరగవు. కానీ కొనుగోళ్లు మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి. అందుకే బంగారం ధరలు భగ్గుమంటుంటాయని మార్కెట్ నిపుణులు చెప్పే మాట నిజమేననిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటివి బంగారం హెచ్చుతగ్గుదలకు ఒక కారణం కాగా, బలమైన కారణం మాత్రం కొనుగోళ్లకు సరిపడా నిల్వలు లేకపోవడం వల్లనే ధరలు మరింత పెరుగుతున్నాయని చెబుతున్నారు.
నేటి ధరలు...
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా అదే బాట పయనిస్తున్నాయి. బంగారం పది గ్రాముల ధర 75 వేల రూపాయలు దాటేసింది. కిలో వెండి ధర లక్ష రూపాయలను అధిగమించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 68,910 రూపాయలు కు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 75,170 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 101100 రూపాయలకు చేరుకుని కొనుగోలుదారులను షేక్ చేస్తుంది.


Tags:    

Similar News