Gold Prices : బడ్జెట్ కు ముందు బంగారం విషయంలో గుడ్‌న్యూస్
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే కొనసాగుతున్నాయి
బంగారం ధరలు పరుగును ఆపాయి. కొంత శాంతించాయి. కేంద్ర బడ్జెట్ ఉన్నందునే ఏమో .. ఈరోజు మాత్రం ధరలు పెరగలేదు. వెండి ధరలు కూడా అంతే. గత రెండు రోజులు నుంచి ధరలు పెరగడంతో బంగారం ధరలు మరింత పెరుగుతాయని భావించారు. బడ్జెట్ తర్వాత పసిడికి రెక్కలు వస్తాయని భావించిన వాళ్లు కూడా ఉన్నారు. అదే అంచనాలో ఉన్న వారికి ఈ రోజు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండటమంటే ఊరట కల్గించే అంశమేనని అనుకోవాల్సి ఉంటుంది.
గిరాకీ మాత్రం...
ఇటీవల పసిడి ధరలు పెరగడంతో కొనుగోళ్లు తగ్గుతాయని భావించినా ఏమాత్రం తగ్గలేదని గణాంకాలు చెబుతున్నాయి. 2023 సంవత్సరంలో బంగారం ధరల్లో కొంత హెచ్చు తగ్గులు కనిపించాయి. భారీగా పెరగలేదు. అలాగని ధరలు అదే స్థాయిలో తగ్గలేదు. దీంతో కొనుగోళ్లు మందగించినా పెళ్లిళ్ల సీజన్ తో పాటు దీపావళికి కొనుగోళ్లు పెరగడంతో అమ్మకాల్లో క్షీణత నమోదు కాలేదు. కానీ ఈ ఏడాది ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఏడాది పసిడికి మరింత డిమాండ్ ఏర్పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
నేటి ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే కొనసాగుతున్నాయి. ఈరోజు బడ్జెట్ తర్వాత మార్పులు కనిపించే అవకాశముందని చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,000 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల వెండి ధర 63,270 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. కిలో వెండి ధర 78,000 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.