Gold Prices : బంగారం ఇంత బరువాయెనే.. పెరగడం విరగడం అనేది?
నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి
బంగారం ధరలు ఇటీవల కాలంలో పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత మాత్రం బంగారం విషయంలో మాత్రం వర్తించదు. ఒక్కసారి పసిడి ధరలు పెరిగితే మాత్రం తగ్గడం మాత్రం ఇక జరగని పని. తగ్గినా అతి తక్కువ మొత్తంలోనే ఉంటుంది. అంతే తప్ప పెరిగిన అంత ధర తగ్గడంలో ఉండదు. అందుకే బంగారం ధరలు ఎప్పుడూ అందకుండానే ఉంటాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు బంగారం బరువుగా మారిపోయింది. బంగారం కొనేకంటే ఒక పెళ్లి సులువుగా చేయవచ్చన్న నానుడి త్వరలో వచ్చేట్లు కనిపిస్తుంది.
ఇలా చేయగలిగితే..?
పసిడి ధరల విషయంలో ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేరు. కేంద్ర ప్రభుత్వం మాత్రం కొంత చర్యలు తీసుకుంటే దిగిరావచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో పాటు దిగుమతులను పెంచగలిగితే బంగారం ధరలు కొంత దిగివస్తాయని చెబుతున్నారు. కానీ ఆ దిశగా ప్రభుత్వం మాత్రం చర్యలు చేపట్టకపోవడంతో బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందన్న హెచ్చరికలు కూడా వినపడుతున్నాయి.
వెండి కూడా...
ఈ పరిస్థితుల్లో గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు నేడు బ్రేక్ ప్రడింది. నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉండటం కొంత ఊరట కల్గించే అంశమే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,000 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,270 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర మాత్రం 78,000 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.