Gold Price Today : మూఢమిలోనూ బంగారం ధరలు పెరుగుతాయా? అయితే ఇది తెలుసుకోండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది.
బంగారం ధరలు దిగిరావడమంటే.. పెద్దగా ధర తగ్గదని అందరికీ తెలిసిన విషయమే. పదో పరకో తగ్గిస్తూ బంగారం తగ్గుతుంటుంది. అదే పెరిగినప్పుడు వందల్లో పెరుగుతుంది. గ్రాము బంగారం ధరపై పది రూపాయలు తగ్గితే అదే పెరిగితే వందల రూపాయలు పెరగడం మామూలుగా మారిపోయింది. ఇది గత కొద్ది రోజులుగా జరుగుతున్న తంతు మాత్రమే. దీనికి కొనుగోలు దారులు కూడా అలవాటుపడిపోయారు. బంగారాన్ని కొనాలంటే ధరలను చూసి కొనుగోలు చేయడం వృధా అన్న నిర్ణయానికి కొనుగోలుదారులు వచ్చేశారు.
మూఢమిలోనూ...
ఈరోజు నుంచి ముహూర్తాలు లేవు. మరో మూడు నెలలు మూఢమి ఉందని పండితులు చెబుతున్నారు. ముహూర్తాలు లేకపోవడంతో ధరలు దిగివస్తాయని మార్కెట్ నిపుణులు చెప్పడం లేదు. అది అత్యాశే అవుతుందని అంటున్నారు. వచ్చే నెలలో ధన త్రయోదశి ఉంది. ఏదోరకంగా బంగారం విక్రయాలను పెంచడమే పనిగా పెట్టుకున్న వ్యాపారులు కొనుగోలు దారులను ఆకట్టుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి మూఢమిలో బంగారం తగ్గుతుందని భావించడం కూడా అత్యాశే అవుతుందన్నది మార్కెట్ నిపుణులు చెబుతున్న మాట.
ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,840 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 79,920 రూపాయలుగా నమోదయిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కిలో వెండి ధర 83,900 రూపాయలుగా కొనసాగుతుంది.