Gold Rates Today : ధరలు దిగివచ్చాయట... ఈ రేటు చూస్తే ఇక అంతే
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. వెండి ధర కూడా తగ్గింది
పసిడి ప్రియులు ఊహించిందే. ధరలు బాగా తగ్గుతాయని భావించడం కూడా దురాశ అవుతుంది. ఎందుకంటే గత మంగళవారం పది గ్రాముల బంగారం ధరపై 800 రూపాయలు పెరిగింది. ఇటీవల కాలంలో ఇది ఆల్ టైమ్ రికార్డు. అయితే ఈరోజు మాత్రం కొంత ఊరట కల్గించేలా బంగారం ధరలు కనిపించాయి. కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గి వినియోగదారులను ఊరించేందుకు కనకం సిద్ధమయింది. బంగారం ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుండటంతో దీనికి గిరాకీ ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గదు.
సీజన్ ముగుస్తున్నా....
మరికొద్దిరోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ముగుస్తుంది. మూఢం ప్రారంభమవుతుంది. మూడు నెలల పాటు జోరుగా పెళ్లిళ్లు జరుగుతుండటంతో విక్రయాలు కూడా బాగా పెరిగాయి. అందుకే బంగారం ధరల్లో పెద్దగా మార్పు చోటు చేసుకోలేదు. అయితే రానున్న కాలంలో కొనుగోళ్లు తగ్గే అవకాశాలున్నాయి. బంగారం ధరలు కొనుగోళ్లు తగ్గితే నేల చూపులు చూస్తాయని భావిస్తే పొరపాటు పడినట్లే. ఎందుకంటే పసిడికి ఒక సీజన్ అంటూ లేకుండా పోవడం వల్లనే ధరలు తగ్గుతాయన్న నమ్మకం కొనుగోలుదారుల్లోనూ సన్నగిల్లింది.
నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,740 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,260 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 79,000 రూపాయలకు చేరుకోవడం గమనార్హం.