Gold Prices Today : గోల్డ్ విషయంలో గుడ్ న్యూస్.. కానీ వెండి మాత్రం పెరిగింది
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అదే సమయంలో వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి
బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు ఊహించిన దానికంటే ఎక్కువ పెరగడం లేదు. అలాగని భారీ స్ధాయిలో తగ్గలేదు. తగ్గాయంటే తగ్గాయని చెబుతున్నారు కానీ బంగారం ధరల్లో పెద్దగా మార్పులు ఉండటం లేదు. కొనేవాళ్లు జ్యుయలరీ దుకాణాల వద్దకు వెళితే ధరలు దిగి వచ్చినట్లు కనిపించడం లేదు. కానీ ధరలు చూస్తే తగ్గాయంటున్నారు. కానీ మార్కెట్ లో ఉన్న ధరలకు జ్యుయలరీ దుకాణాల్లో విక్రయించే ధరలకు మధ్య పొంతన లేకుండా ఉండటంతో దుకాణాల సిబ్బందిని కొందరు నిలదీసే పరిస్థితి వస్తుంది.
తగ్గని ధరలు...
బంగారం ధరలు ఎప్పటికైనా పెరుగుతాయే కాని.. తగ్గవు. అది అందరికీ తెలిసిన సత్యమే. మన కళ్లముందే ధరలు పెరుగుతూనే వెళుతున్నాయి. నెల రోజుల గ్యాప్ లో వేల రూపాయల తేడా బంగారం ధరల్లో కనిపిస్తుంది. అయినా సరే.. అవసరాల నిమిత్తం... సంప్రదాయాలను అనుసరించి తప్పక కొనుగోలు చేయాల్సి రావడంతో బంగారాన్ని కొనుగోలు చేయక తప్పడం లేదు. ప్రస్తుతం మూఢమిలో ముహూర్తాలు లేకపోయినా ధరలు మాత్రం వాటంతట అవి పెరుగుతూనే పోతున్నాయి.
వెండి మాత్రం...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అదే సమయంలో వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. బంగారం, వెండి రెండూ ధరలు పెరగడమో.. తగ్గడమో జరుగుతుంది. కానీ ఈరోజు మాత్రం కొంత తేడా కనిపిస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,740 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,810 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 87,300 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.