Gold Prices Today : తగ్గుతాయన్నది భ్రమేనట.. అందుకే బంగారం కొనుగోలు చేయడమే మంచిదట

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నాలుగో రోజు బంగారం, వెండి ధరలు తగ్గినా అది స్వల్పమే

Update: 2024-03-14 02:20 GMT

బంగారం ధరలు వేగంగా పెరుగుతాయి. అయితే అంత నిదానంగా తగ్గుతాయి. పెరగడలో ఉన్నంత వేగం తగ్గడంలో మాత్రం ఉండదు. ఇది అనుభవపూర్వకంగా తెలిసిందే. అయినా సరే వినియోగదారులు పసిడి ధరలు తగ్గుతాయని ఆశతో ఎదురు చూస్తుంటారు. తగ్గినప్పుడు కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. కానీ బంగారం ధరలు వినియోగదారులు ఆశించినంత స్థాయిలో తగ్గవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అనేక కారణాలతో బంగారం ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి.

దశాబ్దకాలంలో...
మరికొద్ది రోజుల్లో సీజన్ ముగియనుండటంతో బంగారం ధరలు తగ్గుతాయని భావిస్తున్న వారికి మార్కెట్ నిపుణులు ఒక మాట చెబుతున్నారు. ఎక్కువ ధర తగ్గుతుందని ఆశించవద్దని అంటున్నారు. నిలకడగా ఉంటే సంతృప్తి పడమని సూచిస్తున్నారు. బంగారం ధరలు భారీగా పెరగడమే కాని ఎక్కువ మొత్తంలో తగ్గడమనేది చాలా అరుదైన ఘటన అని గత రెండు దశాబ్దాల కాలంలో బంగారం ఎప్పుడు ఎక్కువ స్థాయిలో తగ్గలేదన్న విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు.
ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నాలుగో రోజు బంగారం, వెండి ధరలు తగ్గినా అది స్వల్పమే. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు, కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,340 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65,830 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 78,400 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News