Gold Prices Today : బంగారం ధరలు స్వల్పంగానే.. వెండి ధరలు భారీగా తగ్గాయిగా

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై వంద రూపాయలు తగ్గింది. వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి.

Update: 2024-02-07 03:03 GMT

బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతుంటాయి. తగ్గితే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. స్థిరంగా సాగినా ఎగిరి గంతేస్తాం. అలా ఉంది ఇప్పుడు బంగారం పరిస్థితి. అయితే బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు అనేవి సాధారణంగానే ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలతో ధరల్లో మార్పులుంటాయని మార్కెట్ నిపుణులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.

ధరలు తగ్గితేనే....
ఎవరెన్ని చెప్పినా ధరలు తగ్గితేనే మంచిదన్న అభిప్రాయం అందరిలోనూ ఉంటుంది. పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు మరింత పెరగకుండా ఉంటే అదే పదివేలు అనుకునే వారు అనేక మంది ఉన్నారు. ధరలు పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గవు. అందుకు కారణం పసిడి అంటే అంత డిమాండ్ ఉండటమే. పసిడికి ఎప్పుడూ విలువ తగ్గదు. దానికి వ్యాల్యూ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కష్టకాలంలోనూ బంగారం మనల్ని ఆదుకునే వస్తువుగా మన చెంతనే ఉంటుంది. అందుకే అందరూ బంగారాన్ని కొనుగోలు చేయాలని భావిస్తుంటారు.
వెండి ధరలు భారీగా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు తగ్గింది. వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. కిలో వెండి ధరపై వెయ్యి రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,740 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,290 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర మాత్రం 75,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News