Gold Prices Today : ధర తగ్గుదల అట.. అలాగని కొనేసుకుంటారా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి కూడా తగ్గుముఖం పట్టింది

Update: 2024-02-24 03:53 GMT

బంగారం, వెండి ధరలు ఆకాశంలోకి చూస్తుంటాయి. నేల చూపులు చూసేది చాలా తక్కువ సార్లు. అయినా సరే డిమాండ్ తగ్గని ఒకే ఒక వస్తువు పసిడి మాత్రమే. అందుకే బంగారాన్ని అమితంగా ప్రేమించేవాళ్లు ఎక్కువ. మహిళలే కాదు.. ఈ మధ్య కాలంలో పురుషులు కూడా బంగారం పట్ల మక్కువ చూపుతున్నారు. అందుకే గిరాకీ పెరిగింది. డిమాండ్ అధికం కావడంతో పాటు దిగుమతులు తక్కువగా ఉండటం వల్లనే ధరలు మరింత ప్రియం అవుతాయని అంచనా వేస్తున్నారు.

అదుపు చేయడం...
ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలను అదుపు చేయడం కష్టం. పైగా మూడు నెలలు పెళ్లిళ్ల సీజన్ కావడం కూడా ధరలు పెరుగుదలకు కారణంగా చూడాలి. అందుకే తగ్గినప్పుడే కొనుగోలు చేయాలన్నా గత కొద్ది రోజుల నుంచి బంగారం, వెండి ధరలు స్వల్పంగానే తగ్గుతున్నాయి. పది గ్రాములపై పది రూపాయలు మాత్రమే తగ్గుతూ వస్తుంది. పెద్దగా తగ్గుదల కాకపోయినా భారీ మొత్తంలో కొనుగోలు చేసే వారికి ఈ తగ్గుదల కొంత ఊరటనిస్తుందని కూడా భావిస్తున్నారు.
ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి కూడా తగ్గుముఖం పట్టింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,940 రూపాయలుగా ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,720 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 75,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.



Tags:    

Similar News