Gold Price Today : పుత్తడి ధర భారీగా తగ్గుతుందని భావిస్తే పొరపాటే.. రానున్న కాలంలో?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా దిగివచ్చాయి
పుత్తడి అంటే ఎవరికి మాత్రం మక్కువ ఉండదు. పసిడిని సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ పరితపిస్తుంటారు. మిగిలిన ఖర్చులను తగ్గించుకోనైనా పసిడిని తమ ఇంటికి తెచ్చుకునేందుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇటీవల కాలంలో పురుషుల్లో కూడా బంగారం కొనుగోలు పట్ల ఆసక్తి పెరిగింది. దీంతో పుత్తడికి డిమాండ్ అధికమయింది కానీ గతంలో కంటే ఏ మాత్రం తగ్గలేదు. ధరల పెరుగుదలతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుండటంతో జ్యుయలరీ దుకణాల యజమానులకు చేతినిండా పని దొరుకుతుంది.
సీజన్ ముగియనుండటంతో...
అదే సమయంలో వచ్చే నెలతో పెళ్లిళ్ల సీజన్ ముగియనుంది. ఇక తర్వాత కొన్ని రోజులు మూఢమి ఉంటుంది. అందుకే కొనుగోళ్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నప్పటికీ సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేసే వస్తువు బంగారం కావడంతో వ్యాపారులు మాత్రం బేఫికర్ గానే ఉన్నారు. పెళ్లిళ్ల అవసరాల కోసం విధిగా బంగారం కొనుగోలు చేసేవాళ్లు ఎక్కువ శాతం మంది ఉంటే.. పెట్టుబడి రూపంలో కొనుగోలు చేసే వారు కొందరున్నారు. అందుకే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. దాని ధరలు కూడా కిందకు దిగిరావు.
తగ్గిన ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా దిగివచ్చాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,370 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65,860 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 79,900 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.