Gold Prices Today : చెవులకు ఇంపైన వార్త.. ఇది... విన్నారా...? ఎన్నాళ్లకెన్నాళ్లకు?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి

Update: 2024-04-23 03:32 GMT

బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి కొంత మేర దిగివస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ లో గోల్డ్ రేట్లు కొంత తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై ఐదు వందల రూపాయల వరకూ తగ్గింది. కిలో వెండి ధరపై వెయ్యి రూపాయల వరకూ తగ్గింది. దీంతో బంగారం, వెండి ధరలు ఇంత భారీ మొత్తంలో తగ్గడం చాలా రోజుల తర్వాత చూశామంటూ వ్యాపారులు చెబుతున్నారు.

అవసరంగా మారడంతో...
బంగారం, వెండి అనేది ఇప్పుడు అవసరంగా మారింది. నాడు బంగారం, వెండి ఎప్పుడైనా అవసరమైతే తప్ప కొనుగోలు చేసేవారు కాదు. అదీ ఇళ్లలో శుభకార్యాలున్నప్పుడే బంగారానికి డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. చుట్టాలింటికి వెళ్లాలన్నా బంగారం కొనుగోలు చేయాలి. పుట్టిన రోజు వేడుకలకు బంగారం బహుమతిగా ఇవ్వడం ఒక రివాజుగా మారింది. ఇక అనేక సందర్భాలు బంగారాన్ని కొనుగోలు చేసేలా పురిగొల్పుతున్నాయి. దీంతో సీజన్ తో నిమిత్తం లేకుండా ధరలు పెరుగుతూనే పోతున్నాయి.
ధరలు తగ్గి...
డిమాండ్ కు తగినట్లు బంగారం నిల్వలు లేకపోవడం కూడా ధరలు పెరగడానికి కారణంగా చూడాల్సి ఉంటుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,540 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,689 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర 88,900 రూపాయల వద్దగా నమోదయింది.


Tags:    

Similar News