Gold Price Today : వీకెండ్ గుడ్ న్యూస్... బంగారం ధరలు తగ్గాయిగా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.
పసిడి ధరలు పెరుగుతూనే ఉంటాయి. వాటికి కళ్లెం పడదు. కొన్నేళ్లుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ధరలు ఎక్కడి నుంచి ఎక్కడకు చేరుకున్నాయో కొనుగోలు దారులకు కూడా తెలియంది కాదు. అయితే నాటి ప్రజల కొనుగోలు శక్తిని బట్టి బంగారం, వెండి ధరలు ఉన్నాయి. ఈరోజు కొంత కొనుగోలు శక్తి పెరగడంతో బంగారం, వెండి ధరలకు కూడా ఆటోమేటిక్ గా రెక్కలు వస్తున్నాయి. అప్పటికీ, ఇప్పటికీ కొన్ని వేల రూపాయల తేడా ధరల్లో ఉంది. నాడు బంగారం కొనుగోలు చేసిన వారికి ఇప్పటి ధర చూసుకుంటే మంచి లాభమనే చెప్పాలి. అందుకే బంగారానికి వినియోగదారులు ఫిదా అవుతుంటారు. కొనుగోలు చేస్తుంటారు.
తక్కువ మొత్తంలో...
బంగారం, వెండి ధరలకు ఒక సీజన్ అంటూ ఏమీ లేదు. అనేక కారణాలతో ధరలు పెరుగుతుంటాయి. బంగారాన్ని స్టేటస్ సింబల్ గా మాత్రమే కాకుండా, లైఫ్ సెక్యూరిటీగా కూడా భావిస్తారు. ఎంత బంగారం తమ వద్ద ఉంటే అంత మంచిదని నేటి తరమూ భావిస్తుండటంతో ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవేళ తగ్గినా స్వల్పంగానే తప్ప భారీగా తగ్గిన ఘటనలు చాలా అరుదు. ఆ మధ్యం కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ ఆరు శాతం తగ్గించడంతో కొంత దిగుమతులు పెరిగాయి. ప్రపంచంలోనే అతి ఎక్కువగా బంగారాన్ని వినియోగించే దేశం భారతదేశమే. అందులోనూ దక్షిణ భారత దేశంలో మరింత ఎక్కువగా ఉంటుంది.
తగ్గినప్పటికీ...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ధరలు తగ్గడంతో ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. మళ్లీ ధరలు పెరిగే అవకాశముందని తెలిపారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,040 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,140 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. వెండి కిలో 92,900 రూపాయలుగా నమోదయింది.