Gold Prices Today : ఇలా తగ్గుతుండమ్మా.. కాస్త పుణ్యం ఉంటుంది.. కొనేసుకుంటాంగా
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గుముఖం పట్టాయి
బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. కారణాలు అనేకం చెబుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉంటాయి. బంగారంతో పాటు వెండి కూడా తాను కూడా తగ్గేదేలా అంటూ పరుగులు తీయడమే పనిగా పెట్టుకుంది. ఎందుకంటే బంగారం, వెండి వస్తువులకు ఉన్న డిమాండ్ ఈనాటిది కాదు. సంప్రదాయం నుంచి ఈ రెండు వస్తువులకు గిరాకీ అధికమే. కానీ కొనుగోలు శక్తి ప్రజల్లో పెరిగిన తర్వాత డిమాండ్ మరింత అధికమయిందే తప్ప తగ్గలేదు.
ఈ కారణాలతోనే....
తమ వద్ద ఉన్న డబ్బులతో పెట్టుబడి రూపంలో చూడాలంటే.. రెండు విషయాల్లో మాత్రమే. ఒకటి బంగారం, రెండు భూమి. భూమి కొనుగోలు చేయడం అంటే గగనం. అంత డబ్బు తెచ్చి సమకూర్చుకుని దానిపై పెట్టలేరు. అవసరమైనప్పుడు అమ్ముకోవాలన్నా దానికి ప్రాసెస్ ఎక్కువ. అదే బంగారం అయితే ఎంత డబ్బుంటే అంత కొనుగోలు చేయవచ్చు. తమ అవసరాలకు వెంటనే అమ్ముకునే వీలుంది. ఈ కారణాలతోనే బంగారం, వెండికి భారీగా డిమాండ్ పెరిగిందంటున్నారు మార్కెట్ నిపుణులు.
నేటి ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. వరసగా తగ్గుతూ వస్తుండటం ఊరటనిచ్చే అంశమే. గత మూడు రోజుల నుంచి పది గ్రాముల బంగారం ధరపై రెండు వేల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 65,690 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,660 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 95,900 రూపాయలుగా ఉంది.