Gold Prices Today : నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే.. ఊరించి పిలిచేస్తున్నాయిగా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గాయి.

Update: 2024-06-24 03:31 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయన్న అందరి అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తుంది. మొన్నటి వరకూ కొంత శాంతించిన ధరలు మళ్లీ పరుగును అందుకున్నాయి. బంగారం ధరలు ఎప్పుడూ అంతే.. ఊరించి మనల్ని కొనుగోలు చేసేలా చేస్తాయి. ధరలను చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందేనన్నట్లు ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ ఉన్నవాళ్లు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. ఎందుకంటే భవిష్యత్ లో బంగారం ధరలు మరింత భారంగా మారనున్నాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రానున్న కాలంలో...
బంగారం, వెండి అంటే అపురూపమైన వస్తువులుగా మారిపోయాయి. ఇప్పటికే ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. బంగారం కొనుగోలు చేయాలంటే గగనమయ్యే పరిస్థితి నెలకొంది. భారత దేశంలో బంగారం, వెండి పై మక్కువ చూపే వాళ్లు అధికంగా ఉంటారు. ఇక్కడే బంగారు ఆభరణాల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి. ప్రధానంగా దక్షిణ భారత దేశంలో బంగారు ఆభరణాల కొనుగోలుకు ఇచ్చిన ప్రాధాన్యత గోల్డ్ బాండ్స్, బిస్కెట్లకు ఇవ్వరు. మహిళలు తాము ఎక్కువగా వినియోగించుకునేందుకు, కుటుంబ అవసరాలకు మాత్రమే బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది.
తగ్గిన ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వందరూపాయలు తగ్గింది. సీజన్ ప్రారంభమయితే ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అప్పుడు పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రూపాయలకు చేరుకుంటుందని, కిలో వెండి ధర లక్ష రూపాయలకు పైగానే పలుకుతుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,340 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,370 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 96,400 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News