Gold Prices Today : గుడ్ న్యూస్ బంగారాన్ని శ్రావణమాసం ప్రారంభమయ్యే ముందే కొనుగోలు చేయండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టాయి

Update: 2024-07-22 04:29 GMT

బంగారం ధరలు ఎప్పుడూ పైకి ఎగబాకుతూనే ఉంటాయి. తమ అంచనాలుకు అందకుండా ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు ఎప్పటికప్పుడు షాక్ కు గురవుతున్నారు. అయినా సరే బంగారం పై ఉన్న మోజుతో కొనుగోలు చేయకుండా ఉండలేకపోతున్నారు. అవసరం లేకపోయినా అనేక మంది బంగారం, వెండి కొనుగోలు చేయడం హ్యాబీగా మార్చుకున్నారు. ఎందుకంటే బంగారం ఉంటే భద్రత ఉంటుందన్న నమ్మకంతోనే కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో పాటు స్టేటస్ సింబల్ గా కూడా బంగారం, వెండి మారిపోవడంతో సమాజంలో గౌరవం మరింత పెంపొందించేందుకు జ్యుయలరీ దుకాణాలకు క్యూ కడుతున్నారు.

ప్రతిరోజూ...
బంగారం ధరలు ప్రతి రోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్య, దిగుమతులు మందగించడం వంటి కారణాలతో బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. కొనేవారు ఎక్కువ. ఉన్న బంగారం తక్కువగా మారడంతో డిమాండ్ కు తగినట్లుగా బంగారం నిల్వలు లేకపోవడం కారణంగా వీటి ధరలు పెరుగుతూ పోతున్నాయి. సీజన్, ఆఫ్ సీజన్ తో సంబంధం లేకుండా ధరలు పెరిగేది ఒక్క బంగారం విషయంలోనే మనం చూస్తాం. ఎప్పుడూ జ్యుయలరీ దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతుండటమే ఇందుకు ప్రధాన కారణం.
నేటి ధరలు...
బంగారం, వెండి ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వచ్చే నెల నుంచి ధరలు మరింత ప్రియమవుతాయని చెబుతున్నారు. భారీగా ధరలు పెరిగే అవకాశముందని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,790 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,960 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 95,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News