Gold Prices Today : బంగారం ఉంటే.. భద్రత మన వెంటే...ఈరోజు కొనుగోలుకు మంచి రోజు

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి

Update: 2024-06-16 04:15 GMT

బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నాయి. వాటిని ఆపడం ఎవరి తరమూ కావడం లేదు. రోజురోజుకూ బంగారం, వెండి ధరలు పెరగడమే తప్ప తగ్గడమనేది అస్సలు జరగదు. బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందుబాటులోకి రావడం అనేది ఇక భవిష్యత్ లో జరగదన్నది అందరికీ అర్థమయిన విషయమే. ఎందుకంటే బంగారం ధరలు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాయో తెలిసిన వారు ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కునే పనిని మాత్రం చేయరు. అందుకే ధరల పెరుగుదల అనేది కామన్ అయిపోయింది.

బంగారం ఉంటే...
బంగారం, వెండి అంటేనే అందరకీ ప్రియమైన వస్తువులు. అవి తమ ఇంట ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదని భావిస్తారు. అదే సమయంలో తమకు భద్రత అని భావిస్తారు. కష్ట సమయాల్లో తమకు తోడుగా ఉండే బంగారాన్ని కొనుగోలు చేయడానికి అందరూ ముందుంటారు. అందుకే బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అందుకే ధరలు పెరిగాయని కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. సీజన్ కాకుండానే ధరలు పెరగడం వల్ల ఇక పెళ్లిళ్ల సీజన్ లో ధరలు మరింత ప్రియమవుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
నేటి ధరలు...
ఈరోజు ధరలకు కొంత కొంత బ్రేక్ పడినట్లే కనిపిస్తుంది. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేయాలంటే ఈరోజుకు మించిన రోజు మరొకటి లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,500 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,550 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 95,600 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News