Gold Prices Today : హమ్మయ్య కాస్త నెమ్మదించింది... ఇలాగే ఉంటే బాగుంటుందిగా
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో తగ్గాయి
బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. వాటి ధరలను ఆపడం ఎవరి వల్ల కావడం లేదు. పెరిగితే భారీగా తగ్గితే స్వల్పంగా బంగారం ధరలు తగ్గడం అందరికీ తెలిసిందే. అయినా ఎంతో కొంత తగ్గితే చాలు అన్న భావనకు కొనుగోలుదారులు వచ్చేశారు. బంగారాన్ని మాత్రం ఇంటికి తెచ్చుకోవడానికి ఏ మాత్రం సందేహించడం లేదు. అందుకు కారణం బంగారానికి ఎప్పుడూ మెరుపు తగ్గదు. అలాగే ధరలు కూడా తగ్గవు. అందుకే బంగారానికి అంత డిమాండ్ దక్షిణ భారత దేశంలో ఎక్కువగా ఉంటుంది.
వెండి కూడా...
ఇక వెండి విషయంలోనూ అంతే డిమాండ్ ఉంటుంది. బంగారం, వెండి వస్తువులు కేవలం స్టేటస్ సింబల్ గానే చూడటం లేదు. శుభకరమైన వస్తువులుగా భావించడం మొదలయింది. ఎంత జ్యుయలరీ ఉంటే అంత సేఫ్ అన్న భావన ప్రజల్లో కలుగుతుంది. సమాజంలో గౌరవంతో పాటు కష్టాలు ఎదురయినప్పుడు ఆదుకునే వస్తువుగా బంగారం, వెండి ఉపయోగపడినట్లు మరే వస్తువు ఉపయోగపడదు. భూమిపై పెట్టుబడి పెట్టాలంటే ఎక్కువ డబ్బులు పెట్టాలి. అలాగే బంగారాన్ని కొద్దికొద్దిగా కూడబెట్టుకోవచ్చన్న భావనతో ఎక్కువ మంది పెట్టుబడిగా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
ధరలు ఇలా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,240 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,260 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 85,900 రూపాయలుగా కొనసాగుతుంది.