Gold Rates Today : బంగారం ధరలు ఈరోజు రా రమ్మని పిలుస్తున్నాయిగా

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత నిదానించాయి

Update: 2024-05-27 03:26 GMT

బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. దానికి రెక్కలుంటాయంటారు. అందుకే ఎగరడమే తప్ప దిగడం అనేది పెద్దగా తెలియదు. బంగారం, వెండి ధరలు మరింత ప్రియమవుతాయని మార్కెట్ నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల రూపాయలు దాటుతుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ఎప్పుుడూ నిలకడగా ఉండకపోవడానికి అనేక కారణాలు చెబుతున్నప్పటికీ .. ఏ కారణాలు లేకున్నా ధరలు మాత్రం పెరుగుతూనే ఉంటాయి.

మదుపు చేసే వారికి మక్కువ...
బంగారం అంటే పడిచచ్చేంత ఇష్టపడే వారు దక్షిణ భారతదేశంలోనే అధికం. ఎందుకంటే ఇక్కడ బంగారం, వెండి వస్తువులను శుభప్రదంగా చూస్తారు. ఎంత బంగారం, వెండి ఉంటే అంత తమ కుటుంబానికి రక్షణగా ఉంటుందని భావిస్తారు. ఇక పెట్టుబడి పెట్టే వారు కూడా బంగారంపై ఎక్కువగా ఫోకస్ పెడతారు. కావాల్సిన సమయంలో సులువుగా విక్రయించుకోవడానికి వీలుగా బంగారం ఒక్కటే ఉండటంతో మదుపు చేసే వారు బంగారం కొనుగోలుపైనే ఎక్కువగా మక్కువ చూపుతారు. అందుకే ధరలు అనేవి దిగిరావంటారు.
స్వల్పంగా తగ్గి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత నిదానించాయి. ధరలు పెరగకుండా స్వల్పంగా తగ్గినా కూడా అది గోల్డ్ లవర్స్ కు ఊరట కలిగించినట్లే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,390 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72, 430 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 95,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News