Gold Prices Today : మగువల మైండ్ సెట్ అదే.. అందుకే తగ్గిందని సంబరపడటం లేదట
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత నేల చూపు చూశాయి
పసిడి ప్రియులు వారంలో ఒకరోజు ఆనందపడితే.. మిగిలిన ఆరు రోజులు కలత చెందుతారు. ఎందుకంటే ఎక్కువ సార్లు బంగారం ధరలు పెరుగుతుంటాయి. తక్కువ సార్లు తగ్గుతుంటాయి. తగ్గినా స్వల్పంగానే ధర ఉంటుంది. అదే పెరిగితే మాత్రం భారీగా ఉంటుంది. అందుకే తగ్గకపోయినా చాలు.. పెరగకుంటే అదే మేలు అన్న రీతిలో పసిడి ప్రియుల మైండ్ సెట్ మారిపోయింది. ధరలు ఎంత ఉన్నప్పటికీ కొనుగోలు చేయడం తప్పనిసరి కావడంతో ధరలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. స్వల్పంగా ఈరోజు తగ్గినా రేపు భారీగా పెరిగే అవకాశముందన్న ఆందోళన అయితే ఉంది.
అందనంత దూరంలో...
దేశంలో బంగారానికి ఎప్పటి నుంచో అధిక డిమాండ్ ఉంది. డిమాండ్ కు తగినట్లుగా బంగారం దిగుమతులు కూడా లేవు. కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా పెద్ద స్థాయిలో బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి లేదు. మరో వైపు కస్టమ్స్ డ్యూటీ కూడా బంగారం ధరపై పడి మరింత భారంగా మారనుంది. అందుకే బంగారం ధరలు ఇప్పటికే సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్నాయి. మరోవైపు విదేశాల్లో నెలకొన్న మాంద్యం కూడా ధరలు పెరుగుదలకు కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
స్వల్పంగా తగ్గి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత నేల చూపు చూశాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,140 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,700 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 80,400 రూపాయలుగా కొనసాగుతుంది.