Gold Price Today : ధరలు దిగివస్తాయని అనుకోవద్దు...ఎప్పుడూ పెరగడమే దానికి తెలిసిన రూటు
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు కూడా కొంత నెమ్మదించాయి
దేశంలో బంగారం వెండి ధరలు పెరగడమే తప్ప తగ్గడమనేది అరుదుగా జరుగుతుంటుంది. ఇక మూఢమి కూడా ప్రారంభమయింది. పెళ్లిళ్ల సీజన్ ముగిసింది. మరో మూడు నెలల పాటు ముహూర్తాలే లేవు. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడతాయని కొనుగోలుదారులు భావిస్తున్నారు. మూడు నెలలు బంగారం కొనుగోలు చేయడానికి సీజన్ కాదని, అందుకోసం ధరలు కూడా దిగి వస్తాయని అందరూ ఆశపడుతున్నారు. కానీ ధరలు దిగి వచ్చే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అక్షర తృతీయతో...
మూఢమి అయినా అక్షర తృతీయ ఉంది. ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేయడాన్ని మంచిదిగా భావిస్తారు. అందుకే బంగారం ధరలు పెరుగుతాయే తప్ప తగ్గవన్నది మార్కెట్ నిపుణుల మాట. కేవలం ఐదు నెలల్లోనే పది వేల రూపాయలు పెరిగిందంటే బంగారం ధరలు ఎలా ఎగబాకుతున్నాయో వేరు చెప్పాల్సిన పనిలేదు. అందుకే సీజన్ తో సంబంధం లేదని, బంగారాన్ని ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబడిగా చూసే వారు ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు.
నేటి ధరలు...
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు కూడా కొంత నెమ్మదించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే బంగారం ధరలు తగ్గాయని భ్రమిస్తే పొరపాటు పడినట్లేనని, గంటలు గడిచే కొద్దీ మళ్లీ పెరుగుతాయని కూడా చెబుతున్నారు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,540 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,590 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధరల 83,900 రూపాయలు పలుకుతుంది.