Gold Prices Today : ఏందో ఈ పది రూపాయలు తగ్గడమేంటో... ఇది అసలు తగ్గుదలేనంటారా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి.
బంగారం ధరలు తగ్గాయంటూ పసిడి ప్రియులకు ఊరట అంటూ చెప్పుకోవడానికే తప్ప ఏ మాత్రం ఉపయోగం లేదు. కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గుతూ కొనుగోలుదారులను ఊరిస్తున్నాయి తప్పించి అసలు దీనిని తగ్గడమంటారా? అన్న ప్రశ్నలు కూడా ఉదయించక మానదు. బంగారం ధరలు పెరిగితే భారీగా, తగ్గితే స్వల్పంగా ఉండటం సాధారణమే అయినా పది రూపాయలు పది గ్రాములపై తగ్గుతుండటం ఇటీవల కాలంలో ఎక్కువ రోజుల నుంచి చూస్తున్నాం.
అనేక కారణాలు అంటూ...
అసలు పది రూపాయలు తగ్గించకపోతే ఎవరు ఏడ్చారంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే బంగారం ధరల పెరుగుదల, తగ్గుదల తమ చేతుల్లో ఉండవని, అంతర్జాతీయ మార్కెట్ లో పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం, విదేశీ మారక ద్రవ్యం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో కొనసాగుతున్న మాంద్యం వంటి కారణాల వల్ల బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నప్పటికీ ఇంత తక్కువ మొత్తంలో ధరల తగ్గుదలపై పసిడి ప్రియులు పెదవి విరుస్తున్నారు.
బంగారం, వెండి ధరలు తగ్గినా...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,340 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,550 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 76,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.